తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు

నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అవకాశవాదం మూర్తీభవించిన నిలువెత్తు విగ్రహం అని ఎవరైనా చెపుతారు. ఏనాడు ఆయన తెలంగాణా ఉద్యమంలో పాల్గొన కుండానే ఎలాంటి త్యాగాలు చేయకుండానే కేసీఆర్ దయాబిక్షతో, ఉద్యమంలో పాల్గొన్న వారికంటే అత్యధిక ప్రయోజనాలు పొందిన నిండైన అనుమానంలేని అవకాశవాదని ఆర్టీసీ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణాలో అధికారం టీఆరెస్ కైవసం చేసుకోగానే అంతకుముందు తనకు రాజకీయ జీవితం ఘనంగా ఇచ్చిన టిడిపికి క్షణంలో అంజాన్ కొట్టిన తలసానిలోని అవకాశవాదం అర్ధంకానిదెవరికి అంటున్నారు ఆర్టీసీ యూనియన్ల నాయకులు 

talasani srinivas yadav puvvaDa ajay" />

ప్రతిపక్ష పార్టీల మీద ఆ నాయకుల మీద నోరు పారేసుకోవటానికి నేడు కేసీఆర్ కు, నాడు నారా చంద్రబాబు నాయుడికి కొంత మంది నేతల అవసరం ఉంటుంది.అలాంటి అవసరం తీర్చడానికే తలసాని లాంటి వాళ్ళు పుట్టింది. అంతే కాదు ఒక పార్టీ అధినేతను సేవించే వేళ అతనే సర్వస్వం అంటారు. కథ మారితే ఇంకో మహానేత పాదాల చెంత చేరి  'నీ కాల్మొక్కుత బాంచన్ దోరా!' అంటారు. ఇది పలువురు ప్రకటించిన అభిప్రాయం


అలాంటి నేతల్ని ప్రజా సమస్యలపై ఉద్యమించే వేళ అవసరమైతే సాధారణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిస్తే లాభం సంగతేమో గాని నష్టమే ఎక్కువగా జరుగుతుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా పాల్గొనని పువ్వాడ అజయ్ లాంటి వాళ్ళు రవాణా మంత్రిగా, ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను తప్పు పట్టే విషయంలో అప్పట్లో ఉద్యమం అంటే కస్సు బుస్సు మన్న srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను చుట్టూ పెట్టుకోవటానికి మించిన తప్పు పని మరొకటి ఉండదన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు అర్ధం చేసుకోరో? తెలియదు అర్థం కూడా కాదు.

talasani srinivas yadav puvvaDa ajay" />

నాడు టిడిపిలో చంద్రబాబు సహాయంతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి, ఆ తరవాత రాష్ట్ర విభజనతో టీఆరెస్ లోకి గోడ దూకి కేసీఆర్ పంచన చేరి పదవులు దక్కించుకున్న ఈయనంత అవకాశవాది మాత్రమే కాదు అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారా? అనేది సంశయాస్పదమే అంటున్నారు తెలంగాణా వాదులు. కేసీఆర్ సహాయంతో తన కొడుక్కి కూడా ఎంపీ సీటిప్పించుకొని గెలవలేని ఇతను ఇతర పార్టీల్లోని నాయకులను తెగనాడటం విఙ్జత ఎలా అనిపించుకుంటుంది? 


తాజాగా తలసాని మాటలు వివాదాస్పదంగా మారటమే కాదు, ఉద్యోగ సంఘాల వారిని, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతి విషయానికి ముఖ్య మంత్రి కేసీఆరే పిలిచి మాట్లాడాలా? తామంతా మనుషులం కాదా? అంటూ తలసాని చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతేకాదు ఇలాంటి వారి మాటల వలననే టిఎస్ ఆర్టీసి సమ్మె మరింతగా జటిలమౌతుంది. అయినా కెసీఆర్ తీర్చలేనిది వీళ్ళు తీర్చగలరా? అయినా నిర్ణయాల్లో వీరిపాత్ర 'కంటిలో నలకంత' అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.

talasani srinivas yadav puvvaDa ajay" />

ఈ రోజున తెలంగాణలో ఎ నిర్ణయం అయినా కేసీఆర్ ఆజ్ఞానుసారమే జరుగుతుందన్న విషయం జగమెరిగిన సత్యం. అప్పుడు తలసాని లాంటి వారికి తెలీకుండా ఏలా ఉంటుంది? నామ మాత్రం మంత్రులైన వీళ్ళకు నిర్ణయాధికారం ఉండదని, ఆయా శాఖలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా అయినా కేసీఆర్ 'వినా' వేరెవరూ తీసుకోలేరు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మంత్రులకే దొరకని దురదృష్ట దుస్థితి రాష్ట్రంలో స్థిరపడి ఉంది. అలాంటి వేళ, తమకున్న సమస్యల పరిష్కారంకోసం ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని మాత్రమే సంప్రదించాలని కోరుకోవటంలో ఎలాంటి తప్పు లేదు సరికదా! అదే సరైన సమాధానం కదా!


ఇప్పటి వరకు తెలంగాణలో తలసాని సహా మంత్రులెవరైనా స్వతంత్రించి తీసుకున్న కనీసం ఒక నిర్ణయాన్నైనా తలసాని ఉదాహరణగా చూపిస్తే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. "తామంతా మనుషులం కాదా?" అని ప్రశ్నిస్తున్న తలసానికి ఒకటే సమాధానం "మంత్రులతో సరిపోయే దానికి ముఖ్యమంత్రి ఎందుకు" టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

talasani srinivas yadav puvvaDa ajay" />

అయితే కేసీఆర్ మెహర్బాని కోసం-"ఎన్నికల మేనిఫేస్టోలో ఆర్టీసీ అంశాన్ని తాము హామీగా ఇవ్వలేదని, అలాంటప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఈ డిమాండ్ ఎందుకు తెరమీద కు తెచ్చారు" అని తనకున్న అపార జ్ఞానాన్ని నడిబజార్లో కుమ్మరించేసి మరీ ప్రశ్నిస్తున్న తలసానికి....తెలంగాణా ఉద్యమ చరిత్ర తెలుసా? అంటున్నారు తెలంగానా జనం. "సారు ఇచ్చిన హామీల్ని మాత్రమే కాదు, ఇవ్వని హామీలకు సంబందించి కూడా పథకాల్ని తెరమీదకు తెచ్చి అమలు చేస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు" అని ముక్తాయింపు ఇచ్చిన తలసాని, చరిత్ర సమస్థం అవకాశవాద పరాయణత్వం అంటున్నారు తలసాని నైజం తెలిసిన సికిందరాబాద్ వాసులు. 


ఆత్రంతో చాన్స్ దొరకగానే - అధినేత మనసు దోచుకోవాలన్న తుత్తర ఎంతున్నా తెలంగాణా ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి తెలంగాణా వాది గుండెల్లో చలిమంటలు రేపు తుంది. ఇలాంటివి చిల్లర వ్యవహారాలు ప్రజల్లో పలుకుబడిని దెబ్బ తీయటం తప్ప వేరే ప్రయోజనం చేకూర్చవని ఇప్పటికైనా తలసాని గుర్తిస్తే మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: