బీరు బాబులకు ఇది నిజంగా చేదు వార్తే..?

Chakravarthi Kalyan

అవును ఇది నిజంగా బీరు ప్రియలకు చేదువార్తే.. ఎందుకంటే ఇప్పుడు బీరు ధరలు ఆంధ్రప్రదేశ్ లో పెరిగాయి. రేపటి నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా తయారైన మద్యం 60, 90ml బాటిల్లపై రూ. 10 పెరగనుంది. అలాగే 180 ml బాటిల్ పై 20 రూపాయలు ధర పెరగనుంది.


ఇక 375ml బాటిల్ పై 40 రూపాయలు పెరుగుతుంది. 750ml బాటిపై 80 రూపాయలు పెరుగుతుంది. 1000ml బాటిల్ పై 100 రూపాయలు పెరుగుతుంది. 2000ml బాటిల్ పై 200 రూపాయల పన్ను విధించారు. ఈ ధరలన్నీ లోకల్ మేడ్ మద్యానికే వర్తిస్తాయి.


ఇక విదేశీ మద్యం ధరలు కూడా పెరిగాయి. వీటికి 50 ml, 60 ml బాటిల్ పై 10 రూపాయలు పెంచారు. 200 -275 ml బాటిల్ పై 20 రూపాయలు పెంచారు. 500-2000ml బాటిళ్లపై 250 రూపాయలు.. 330ml, 550 ml బీర్లపై 10 రూపాయలు పెంచారు. 650ml బీరుపై20 పన్ను పెంచారు.


ఇది నిజంగా మందుబాబులకు చేదువార్తే అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులపై ఆంక్షలు ఎక్కువై పోయాయి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మందుబాబులకు చెడ్డరోజులు ప్రారంభమైపోయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల టైమింగులు మార్చేశారు. రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలు బంద్ చేస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చేశారు.


ఈ పరిణామాలతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఇప్పుడు బీరు రేట్లు పెరగడంతో బీరు ప్రియులు బెంగపెట్టుకునే రోజులు వచ్చేశాయి. ఇంకా ముందు ముందు జగన్ సర్కారు ఎన్ని ఆంక్షలు విధిస్తుందో అన్న ఆందోళన మందుబాబుల్లో కనిపిస్తోంది. జగన్ పాలన అంతం నాటికి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలోనే మందు లభించేస్థాయికి తీసుకెళ్తానని జగన్ ఇప్పటికే చెప్పారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: