మేము వారికోసం పనిచేయము - గూగుల్ ఉద్యోగులు

Gowtham Rohith
గూగుల్ ప్రపంచంలో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్లలో ఒకటి. దేశం యొక్క దక్షిణ సరిహద్దు దాటి వలస వచ్చిన వారితో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గూగుల్  యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ (సిబిపి) తో పనిచేయదని డిమాండ్ చేస్తూ 350 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు కంపెనీకి బహిరంగ లేఖ రాశారు.


365 మంది గూగుల్ ఉద్యోగులు మరియు 35 మంది మద్దతుదారులు బుధవారం రాసిన ఈ లేఖలో కంపెనీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ), ఆఫీస్ ఆఫ్ రెఫ్యూజీ రీసెట్మెంట్ (ఓఆర్‌ఆర్) లతో కలిసి పనిచేయవద్దని కోరుతూ మూడు ఏజెన్సీల పై మానవ హక్కుల ఉల్లంఘనపై ఆరోపణలు చేసింది.

"మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం మానేసే వరకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా , నిధులు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిబిపి, ఐసిఇ, లేదా ఓఆర్‌ఆర్ కు ఎలాంటి మద్దతు ఇవ్వకుండా గూగుల్ బహిరంగంగా కట్టుబడి ఉండాలని మేము కోరుతున్నాము" అని లేఖలో పేర్కొంది.

"వారు శరణార్థులను భందిస్తున్నారు, పిల్లలను తల్లిదండ్రుల నుండి వేరు చేస్తున్నారు, శరణార్థులను మరియు యుఎస్ పౌరులను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు, నిర్బంధ శిబిరాల్లో  7 గురు పిల్లలు మరణించటానికి దారి తీసిన విధానం చాలా దారుణం " అని లేఖలో  పేర్కొన్నారు.
"సిబిపి, ఐసిఇ, లేదా ఓఆర్‌ఆర్  తో కలిసి డబ్బు కోసం పనిచేయటం  గూగుల్ సిగ్గు పడాల్సిన విషయం " అని లేఖ లో‌ తెలిపారు.


We won’t be complicit: #NoGCPforCBP
With this petition, we call on Google to publicly commit not to support CBP, ICE or ORR w/ any infrastructure, funding, or engineering resources, directly or indirectly, until they stop engaging in human rights abuses.https://t.co/8RITUXKJBq

— Googlers for Human Rights (@EthicalGooglers) August 14, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: