కేంద్ర కేబినెట్ ఫైనల్ - 43 మందికి చోటు - 12 కొత్త ముఖాలు !

Chakravarthi Kalyan
నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గం దాదాపుగా ఖరారైంది. ఈ మంత్రివర్గంలో 43 మందికి చోటు దక్కినట్టు తెలుస్తోంది. ఇందులో దాదాపు 12 మంది వరకూ కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. 


ఇప్పటికే అరుణ్ జైట్లీ వంటి వారు కేబినెట్లో చోటు వద్దని చెప్పిన వేళ..  రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, అర్జున్ రామ్ మేఘవాల్,  ప్రకాశ్ జవడేకర్, రాందాస్ అథవాలే, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వంటి సీనియర్లకు మళ్లీ అవకాశం ఇచ్చారు మోదీ. 

బీజేపీ నేతలతో పాటు మిత్ర పక్షాలుకు కూడా కేబినెట్లో చోటు కల్పించారు మోదీ.  బాబుల్ సుప్రీయో, జితేంద్ర సింగ్,  పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్,  ప్రహ్లాద్ జోషి,. నిర్మలా సీతారామన్,  స్మృతి ఇరానీ, పరుషోత్తం రూపాలా, మన్సుక్ మాండవ్యా,  రావ్ ఇందర్జీత్ సింగ్, అనుప్రియ పటేల్, కిరెణ్ రిజు, సంజీవ్ బలియాన్,  థావర్ చంద్ గెహ్లాట్ మరోసారి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. 

వీరితోపాటు.. రమేశ్ పోఖ్రియాల్,  మన్సుక్ వసావా, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ,,సుష్మా స్వరాజ్, సంతోష్ గాంగ్వర్, రాంవిలాస్ పాశ్వాన్ , గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రదాన్, సాధ్వి నిరంజన్ జ్యోతి, వి.కె.సింగ్ మోడీ కేబినెట్లో చోటు సంపాదించారు. 

ఈ సీనియర్లతో పాటు దాదాపు 12 మందికి కొత్తగా చోటు కల్పించారు మోడీ.. వారిలో తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డితోపాటు.. సురేశ్ అంగాడి,  ప్రహ్లాద్ పటేల్, రవీంద్ర నాథ్, కిషన్ పాల్ గుజ్జర్, కైలాశ్ చౌదిరి, అర్జున్ ముండా, సోం ప్రకాశ్, రామేశ్వర్ తెలీ, దేబాశీష్ చౌదరి, ఆర్సీపీ సింగ్, నిత్యానంద్ రాయ్  ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: