ఎడిటోరియల్ : రిటర్న్ గిఫ్ట్ ఎటు నుంచి ??
కేసీయార్ విషయమే ఇందుకు అచ్చమైన ఉదాహరణ. ఆరు నెలల ముందు ఎన్నికలు పెట్టుకుని బంపర్ మెజార్టితో గెలిచి అయిదేళ్ళ వరకూ తిరుగులేదనిపించుకున్న కేసీయార్ ప్రభ ఒక్క దెబ్బకు కొడిగట్టుకుపోయింది. ఇంటర్ మీడియట్ ఫలితాల రూపంలో వచ్చిన మంటలు కేసీయార్ సర్కార్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పదుల సంఖ్యలో ముక్కుపచ్చలారని విద్యార్ధులు ఇంటర్ మంటలకు ఆహుతి అయ్యారు. వేలల్లో విద్యార్ధులు ఫ్యూచర్ బెంగతో సతమతమవుతున్నారు. వారి వెనక వేలాదిగా తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు.
సరిగ్గా ఇదే అదను అని చూసుకుని ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు కేసీయార్ కి ఓ పవర్ ఫుల్ పంచ్ వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కేసీయార్ పాలనను ఘాటుగా విమర్శించారు. ఒక చిన్న పరీక్ష నిర్వహించలేని వారు దేశాన్ని మారుస్తామని చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఇది ఓ విధంగా కేసీయార్ మీద సమరానికి ఆరంభం అనుకోవచ్చు. రేపటి రోజున బాబు కనుక ఏపీలో మళ్ళీ గెలిచినట్లైతే కేసీయార్ కి తనదైన శైలిలో చుక్కలు చూపించవచ్చు. అంతే కాదు చంద్రబాబే ఇపుడు అసలైన రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అంటున్నారు. మరి చూడాలి కేసీయార్ ఈ గండం నుంచి ఎలా బయటపడతారో.