ఎడిటోరియల్: బాబు - టిడిపి చిమ్మిన విషం, పదింతలుగా ప్రచారం చేసిన సామాజిక వర్గ మీడియా

"ఒక అబద్ధం పదిసార్లు చెపితేనే నిజమై పోతుందనేది జగమెరిగిన గోబెల్స్ సూక్తి" "అదే ప్రతిరోజు, పదులసార్లు, పదేళ్లు చెపితే దాని ప్రభావం ఒక రాజకీయ నాయకుని జీవితం భూస్థాపితం" 


అయితే ఆనాయకుడు మట్టి ముద్దైతే ఒకే! అలా కాక రబ్బర్ బంతైతే ఎగిరి నింగిని తాకి నేలపై అధికారం చెలాయించడా! ఋజువు కావలసి ఉంది. విష ప్రచార పాపాగ్ని ని నిలువరించడా!  ఇక్కడ పట్టుదల ప్రధానం. గత ఐదేళ్ళలో కోటాను కోట్ల  రూపాయలు దోచేశారనే ఆరోపణలున్న అధికార తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం లోని నీతి,  "నేతి బీరకాయలోని నెయ్యంత!"  వీరూ రేపు ఆర్ధిక నేరాల ఊబిలో చిక్కుకోవాల్సిందే, కేసులను ఎదుర్కోవాల్సిందే అంటున్నారు ఆర్ధిక పరిఙ్జానమున్న విశ్లేషకులు. 

మాజీ సిబీఐ జాయింట్ డైరెక్టర్ వి వి లక్ష్మినారాయణ ఒకే ఒక్క స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీ దాని అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్దిపై చేస్తూ వచ్చిన ఆరోపణలలో సింహ భాగం నిజం కాదని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా జగన్ చేసిన లక్షల కోట్ల అవినీతి అంటూ ఇంతకాలం చేసిన విష ప్రచారం అంతా వారి స్వార్ధం కోసం చిమ్మిన విషమని తేలిపోయింది. దాదాపు దశాబ్ధం పాటు ఇలాంటి అబద్ధాలతోనే ప్రచారం కొనసాగించటమే చంద్రబాబు ఆయన పార్టీ అధికారంలో కొనసాగటానికి ప్రధాన కారణం అని తేలిపోయింది. ఈ విష ప్రచారాగ్నికి అవసరమైనప్పుడల్లా ఆజ్యంపోస్తూ ఆ అగ్నిని చల్లారకుండా చూసిన తెలుగు ప్రధాన పత్రికలు, టెలిజన్ చానళ్ళు బహుశ ప్రజలను తప్పుదారి పట్టించిన నేఱానికి తగిన శిక్ష అనుభవించే అవకాశాలు ముమ్మరంగానే కనిపిస్తున్నాయి.  

జేడీ చెప్పిన అసలు నిజం! అదీ ఎన్నికలు పూర్తై, ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తమైన తరుణంలో  

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేసి అందరిలో పాపులర్ లక్ష్మీనారాయణ, తాజాగా ఆ కేసుకు సంబంధించిన సంచలన కామెంట్లు చేశారు. జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనడం రాజకీయ ఆరోపణ లేనని ఆయన వ్యాఖ్యానించారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం జగన్‌  ₹1366కోట్ల మేరకే అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు ఉన్నాయని, తాము చార్జ్‌షీట్‌ లో పొందుపరిచామని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. 

ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీనారాయణ లక్షకోట్లు దోపిడీ జరిగిందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సమాధానం దాటవేశారు. రాజకీయ ఆరోపణలను తాను బాధ్యుడ్ని కాద‌ని, వాటిని తాను ఖండించలేనని చెప్పుకొచ్చారు. జగన్ కేసులను కొందరు నేత‌లు రాజకీయంగా వాడుకుని ఉంటే అందుకు తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 


తండ్రి బాబు కంటే తనయుడు లోకెష్ నాలుగదుగులు ముందుకు వేసి "లక్ష కోట్లంటే ఎన్ని టంక్ బాక్సుల్లో సర్దొచ్చో ఆ బాక్సుల ఘన పరిమాణం కూడా తనకున్న గణిత పరిఙ్జానం వాడేసి మరీ కాలికులేట్ చేసి మరీ సామాన్య జనానికి అర్ధమయ్యే పరిభాషలోకి తర్జుమా చేసి ప్రచారం చేశారు. 


ఇంకా చెప్పాలంటే ₹1366 కోట్లు సైతం ఇప్పటికీ ఆరోపణలే. క్విడ్ ప్రొ కో అంటూ వాడిన పదజాలం నిర్వచనం తో సహా ఇంకా ఋజువు కావలసి ఉంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ, దాని మద్దతు మీడియా చల్లిన బురద, చిమ్మిన విషం, గోబెల్ సూక్తిని అనుసరించి జనంలోకి తీసుకెళ్ళి జగన్మోహనరెడ్డిని అభాసు పాల్చేసిన విధానంతో జరిగిన ప్రచారం ఒక యువ నాయకుని రాజకీయ పరుగును ఒక దశాబ్ధ కాలం నిలిపివేసింది.


ఉమ్మడి రాష్ట్ర సీఎస్ రామాకాంత్ రెడ్డి చెప్పిన నిజాలు వింటే జగన్మోహనరెడ్ది చుట్టూ నాటి కేంద్రం లో అధికారం చలాయించిన రాజకీయ పార్టీ, రాష్ట్ర పాలన చేస్తున్న రాజకీయ పార్టీ, రాష్ట్ర ప్రధాన మీడియా కలసి పన్నిన మాయాజాలమే ఈ ఆరోపణలు అనితెలుస్తుంది. అనుభవఙ్జుడు, మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్ది అసలు విచారణ జరిగిన తీరునే కాదు - మీడియా వేషాలపై సున్నితంగా చురుక్కుమనిపించే చెమక్కులైన మాటలతో విచారణలోని మర్మాన్ని ఎత్తి చూపారు.
 

బహుశ మే 23 నాడు వెలువడనున్న సార్వత్రిక మరియు శాసనసభ ఎన్నికల పలితాలు ఇంత వరకు టిడిపి జరిపిన విష ప్రచారానికి శిక్ష విధించబోతున్నట్లు తెలుగు ప్రజలు భావిస్తున్నారు. 

 
    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: