కూర్చొని మాట్లాడటానికి నేను సిద్దం అన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

Edari Rama Krishna
పుల్వామా పై జరిగిన దాడికి ప్రతి దాడిగా భారత్ వైమానిక దళం జరిపిన దాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మూడు వందల మంది హతమైనట్లు భారత్ ప్రకటించింది.  తమ భూభాగంలోకి యుద్ద విమానాలు చొచ్చుకొచ్చినట్లు పాక్ ప్రభుత్వం కూడా తెలిపింది.  ఈ ఉదయం భారత్ భూగంలోకి పాక్ యుద్ద విమానాలు దాడి జరిపాయి.  తాజాగా భారత యుద్ధ విమానాలను కూల్చామన్న పాక్ వాదనల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

పాకిస్థాన్ ప్రధాని మరోసారి శాంతి చర్చలకు పిలుపునిచ్చారు.   పాకిస్థాన్ ప్రధాని మేం కూడా భారత్ ‌పై దాడులు చేయగలమని చెప్పేందుకే విమానం కూల్చాం అని చెప్పారు.  ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు హెచ్చుమీరితే పరిస్థతులు తీవ్రంగా ఉంటయాన్నారు. అందుకే భారత్, పాక్ కలిసి కూర్చొని మాట్లాడు కుందామని చర్చలకు ఆహ్వానించారు.  భారత్, పాకిస్తాన్ యుద్ధం మొదలుపెడితే అది ఎక్కడికో వెళ్లి ముగుస్తుందని అన్నారు.  ఉగ్రవాదం అంతానికి ఏం చేయాలో చెప్పండంటూ మోదీని ప్రశ్నించారు. భారత్‌పై పాకిస్తాన్ దాడులను ఇమ్రాన్ ఖాన్ సమర్థించుకున్నారు. 

ఫిబ్రవరి 14 నాటి దాడి ఘటనపై భారత్‌ దర్యాప్తు చేసేందుకు సాయం చేసేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.  పాక్ యుద్ధం కోరుకోవడం లేదు. రెండు దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నాం. ఇద్దరు భారత ఫైలట్లు మా అదుపులో ఉన్నారన్నారు ఇమ్రాన్ ఖాన్. ఆలస్యం చేస్తే మోదీతో పాటు తనపరిధి నుంచి కూడా పరిస్థితి చేయి దాటిపోతుందన్నారు.

మా వద్ద కూడా బలమైన ఆయుధాలు ఉన్నాయన్నారు. కానీ యుద్ధం వైపు కాకుండా శాంతిగా సమస్యను పరిష్కరిద్దామని భారత్‌కు సూచించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకవేళ భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే, మేము స్పందించక తప్పదని గతంలోనే భారత్‌కి చెప్పామని పాకిస్తాన్ ప్రధాని అన్నారు.
 Pakistan PM Imran Khan: All wars in world history have been miscalculated, those who started the wars did not know where it will end. So, I want to ask India, with the weapons you and we have, can we afford miscalculation? pic.twitter.com/3wnmLYq39P
— ANI (@ANI) February 27, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: