ప్రధాని జవహర్లాల్ నెహౄ భారత్ మెడకు కట్టిన గుదిబండ ఆర్టికల్ 370

పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం భారత రాజ్యాంగ చట్టం “ఆర్టికల్ 370” (జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి) ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ శరవేగంగా ఊపందుకుంది. ఇంతకూ ఆర్టికల్ 370 ఏం? చెబుతోంది. ఈ ఆర్టికల్ వల్ల జమ్మూ & కశ్మీర్‌కు ఎలాంటి ప్రత్యేక అధికారాలుంటాయి?

పుల్వామా ఉగ్రవాదదాడిలో 49మంది సైనికులు దుర్మరణం చెందడం సగటు భారతీయు ణ్ని కలచి వేసింది. పాకిస్థాన్‌ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.


అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. ఆర్టికల్ 370 రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సత్వరమే విచారించడానికి సుప్రీం కోర్టు కూడా సమ్మతించింది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 గురించి కొంత అవగాహనకు సంబంధించిన విషయాలు: పాఠకుల కోసం:
 

జవహర్ లాల్ నెహౄకు షేక్ అబ్దుల్లా కుటుంబముతో ఉన్న వ్యక్తిగత సహవాసం, మొహమాటం, స్నేహం, దేశభద్రతపై అవగాహన లేమి, కొందరు స్వార్ధపరుల, పెత్తందార్ల స్వప్రయోజనాల కోసం, దేశ అత్యంత రక్షణావశ్యకమైన కాశ్మీర్ లోయని కష్టాల్లోకినెట్టేసి,  దేశ భవినే ఫణంగా పెట్టి ఈ దుస్థితికి కారణం చేశాడు మన ఆత్మీయ జవహర్ లాల్ నెహౄ నాయకత్వం. జవహర్ లాల్ నెహౄ కు షేక్ అబ్దుల్లాతో ఉన్నఅతి సన్నిహితానికి, మొహమాటానికి గుర్తుగా భారత రాజ్యాంగములోని 370 అధికరణం ఉద్భవించి జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి, దేశానికి శాశ్వత గుదిబండగా మారిపోవటం భారత జాతి దురదృష్టం.
 
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 లోని ప్రత్యేక ప్రమాదకర విషయాలు సంక్షిప్తంగా ఏపి హెరాల్డ్ పాఠకులకోసం 
 
@ ఆర్టికల్ 370: భారత దేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని అందించిన కాలకూట విషగుళిక.
 
@ అప్పటి “జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్” అధినేత షేక్ అబ్దుల్లా, భారత ప్రధాని నెహ్రూ మధ్యకుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370.
 
@ ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి
 
@ భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది.
 
@ భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వం వుంటే, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా "రెండు పౌరసౌత్వాలు" కల్పించబడ్డాయి.
 
@ ఈ ఆర్టికల్ తో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జెండా కూడా వుంది.
 
@ దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే, ఇక్కడ ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.
 
@ ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదంట.
 
@ సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు.
 
@ పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం
 
@ జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది.
 
ఆర్టికల్ 370 మూలంగా


 
# సమాచార హక్కు చట్టాలు ఇక్కడ చట్టుబండలే అవి ఇక్కడ పనిచేయవు
 
# విద్యహక్కు చట్టం కూడా ఇక్కడ పనిచేయదు. ఇక్కడ అప్లై చేయబడదు
 
# కాగ్ కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు.
 
# జమ్మూ కాశ్మీర్ మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి.
 
# అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు.
 
# కాశ్మీర్ లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు) రాజ్యాంగబద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
 
# ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది.
 
భారత పౌరసౌత్వం కోసం పాకిస్థానులు చాలా మంది ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు.
ఇప్పటికే చాలా ఘోరం జరిగిపోయింది.
 
ఈ చట్టం లోని ప్రధానాంశాలు చదివితే మీకేమర్ధమౌతుంది?
వీలున్నంతగా షేక్ అబ్దుల్లా లాంటి ఉన్నత వర్గ కుటుంబాలకు,
కాశ్మీరి యువతులను పెళ్ళాడే పాకిస్థాని యువకులకు ప్రయోజనం చేయటం
భారత్ లోని సంపదలో నిండైన సారాన్ని దోచిపెట్టటం లక్ష్యంగా సాగిన ఈ అధికరణం నిర్మాణం చూస్తే:

 సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆర్టికల్ 370ని పూర్తిగా దీన్ని తిరస్కరించారు

* భారత్ కు జవహర్లాల్ నెహౄ ఎంత అన్యాయం చేశాడో?
* భారత్ పై ఎంత దుర్మార్గం చేయసాహసించాడో? అసలు ఆయన నిజంగా భారతీయుడేనా? కనీసం సాధారణ హిందువేనా? అనే 
అనుమానాలు
పొడచూపటం తథ్యం 
* ఏ సందర్భంలో ఆయన ఈ ఆర్టికిల్ లేదా అధికరణం అమలుచేయ సంకల్పించారు?
* ఆయనకు ఆ సమయములో మతిస్థిమితం లేదా?
* ఏ బలహీన క్షణంలో ఆయన్ను షేక్ అబ్దుల్లా కుటుంబం వశీకరణం చేసుకుంది? ఏదైనా వశీకరణ మంత్ర ప్రయోగం జరిగిందా? అనే ప్రశ్నలు సాధారణ పౌరునికి వచ్చే అనుమానాలు.
 
ప్రస్తుతం కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడానికి పావులు కదుపుతోంది.
 

ఎవరైనా సరిహద్దు ప్రాంతాన్ని రక్షణ ప్రాతిపథికన ప్రత్యేక పరిపాలన యంత్రాంగం ముఖ్యంగా యూనియన్ టెర్రిటరి గా చేసి తన కనుసన్నలలో పాలన సాగించవలసిన చోట ఇంతగా షేక్ అబ్దుల్లా లాంటి పయోముఖ విషకుంబానికి లొంగిపోవటములోని "బలహీనత" ఏమిటనేది ఇప్పటికీ భారత్ ప్రజలకు అర్ధంగాని సమస్య.
 

డిల్లి అంగీకార పత్రం ద్వారా జె & కె కి ప్రత్యెక రాజ్యాంగాన్ని, ప్రత్యేక చిహ్నం, ప్రత్యేక జండా, ప్రత్యేక వారసత్వం ఒనగూర్చటమే దేశద్రోహం కాదా! అంతేగాదు దీన్ని ఇప్పటికి ఏడు దశాబ్ధాల నుండి కొనసాగిస్తూ వస్తున్నారు. ఎందరు కశ్మీరీ యువతులు పాకిస్థాన్ యువకులను పెళ్ళాడారో? ఎందరు పాకిస్థానీయులు ఈ ఒడంబడిక మూలంగా భారత పౌరసత్వం పొందారో? వీళ్ళలో ఎవడైనా రేపు కెంద్రములో భారత ప్రథాని అవ్వచ్చు దేశ రక్షణ మంత్రి అవ్వచ్చు. దేశ రక్షణ అప్పుడు ప్రమాదములో పడదా? ఇప్పటికైనా మనం మనలని పరిపాలించు కుంటున్నామా?


ఎవడో భారతీయుని రూపములో ఉన్న పాకిస్థానీ, మనలని ఏదో ఏకంగా వాడుకోవటం లేదు కదా? ఇవన్నీ సగటు భారతీయుని అనుమానాలు. మరి ప్రధాని జవహర్లాల్ నెహౄకి ఈ మాత్రం తెలియదా?
 

- జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ వర్తించవు.
- దీని ప్రకారమే 1965వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. 
- ఆర్టికల్ 370పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
- ఈ ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు జమ్ము & కశ్మీర్  రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌ గా పని చేశారు. 
- రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. 


- ఆర్టికల్ 370ప్రకారం బయటివ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు.
- యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గతఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్రం సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం. 
- జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. 
- రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. 
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: