బ్రేకింగ్ న్యూస్ : వైసిపిలో చేరిన అవంతి...చంద్రబాబుకు షాక్

Vijaya

చంద్రబాబానాయుడుకు పెద్ద షాక్ తగిలింది. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ వైసిపిలో చేరారు. లోటస్ పాండ్ లోని జగన్మోహన్ రెడ్డితో అవంతి భేటీ అయ్యారు. అప్పుడే వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ కూడా అవంతిని స్వాగతించారు. కొద్ది రోజులుగా అవంతికి పార్టీ నాయకత్వంతో విభేదాలు తలెత్తాయి. దానికి తోడు తాను కోరుకున్న భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గంలో అవకాశం రాదని తేలిపోవటంతో టిడిపికి రాజీనామా చేశారు. అవంతి రాజీనామాతో విశాఖపట్నం జిల్లాలో పెద్ద కుదుపు వచ్చినట్లే అనుకోవచ్చు.

 

విశాఖ జిల్లాలో అవంతికి పెద్ద వర్గమే ఉంది. మరి టిడిపికి అవంతి రాజీనామా తర్వాత ఇంకెన్ని రాజీనామాలు ఉంటాయో తెలీదు. జిల్లాలోని మంత్రి గంటాతో కూడా అవంతికి నియోజకవర్గం విషయంలోనే వివాదం మొదలైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజవర్గంలో టికెట్ కు అవంతి కూడా పోటీ పడటంతో ఇద్దరి మధ్య వివాదం తారస్ధాయికి చేరుకుంది. చివరికి వీరిద్దరి పంచాయితీని చంద్రబాబు కూడా తీర్చలేకపోయారు.

 

మొత్తానికి అవంతి టిడిపికి రాజీనామా చేయటమన్నది హఠాత్తుగా జరిగిపోయింది. అంటే తెరవెనుక ప్రయత్నాలు ఎప్పుడో మొదలైనా తెరముందు మాత్రం ఈరోజే మొదలైంది. అవంతితో పాటు ఇంకెంతమంది రాజీనామా చేయబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్సుగా మారింది. రాజీనామాలు చేయబోయే నేతల విషయమై కూపీ లాగటానికి పార్టీ నాయకత్వం తల్లక్రిందులవుతోంది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో మొదలైన రాజీనామాలతో చంద్రబాబుకు టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: