జాతీయ మీడియా మొత్తాన్నీ జగన్ కొనేశాడా..?
పార్లమెంట్ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అందులో భాగంగా ఏపీ ఎన్నికలపైనా తమ సర్వేల ఫలితాలు ప్రకటిస్తూనే ఉన్నాయి.
రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, సీ ఓటర్.. ఇలా చాలా సంస్థలు తమ సర్వే ఫలితాలు ప్రకటించాయి. వీటన్నింటిలో విశేషం ఏమింటే.. అన్నీ కూడా ఏపీలో వైసీపీదే ఆధిక్యం అని నొక్కి చెప్పాయి. కనీసం ఒక్క సర్వే కూడా చంద్రబాబు పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పనే లేదు.
తాజాగా టైమ్ నౌ సర్వే అయితే ఏకంగా జగన్ 25కు 23 ఎంపీ స్థానాలు గెలుస్తుందని చెప్పేసింది. ఈ సర్వే ఫలితాలపై కామెంట్ చేసిన ఏపీ సీఎం.. జగన్ దొంగ సర్వేలు చేయించి తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఈ ఆరోపణ మరీ విడ్డూరంగా ఉంది. జగన్ ఏదో ఒక వార్తా సంస్థను ప్రభావితం చేశాడంటే కొంత వరకూ నిజమేనేమో అనుకోవచ్చు.
కానీ మొత్తం జాతీయ మీడియా మొత్తాన్ని జగన్ కొనేశాడని అనుకోవాలా.. అది సాధ్యమవుతుందా.. ఒకవేళ మోడీ జగన్ కోసం అలా ప్రభావితం చేశాడేమో అనుకుందాం.. అలా అయితే ఆ సర్వేలు మోడీకి అనుకూలంగా ఉండాలి కదా. అలా లేవే మరి. దీన్నిబట్టే అర్థమవుతోంది చంద్రబాబు ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో.