కేటిఆర్ కి కొత్త బాధ్యతలు అప్పగించడానికి ఆలోచిస్తున్న కేసీఆర్..!

KSK
తాజాగా తెలంగాణ రెండు అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిననాడే కెసిఆర్ తనతో పాటు మహమ్మద్ ఆలికి ఉప ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చి క్యాబినెట్ విస్తరణ గురించి కొంత సస్పెన్స్ కొనసాగించారు.


ముఖ్యంగా సెంటిమెంట్ ను నమ్మే కెసిఆర్ ఈ నెల 18 వ తారీఖు మంచి రోజు అని తేలడంతో ఆ రోజు క్యాబినెట్ విస్తరణ కు ముహూర్తం ఖరారు చేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ పగ్గాలను తన తనయుడు కేటీఆర్కి అప్పగించిన కేసీఆర్ తాజా మంత్రివర్గ విస్తరణలో కేటిఆర్ కి కొత్త బాధ్యతలు అప్పగించడానికి రెడీ అవుతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వినపడుతున్న టాక్.


2014లో కేటీఆర్ కి ఐటీ - పరిశ్రమలు - చేనేత అప్పగించగా తాజా విస్తరణలో వాటితో పాటు  సినిమాటోగ్రఫి శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


కాగా గతంలో సాగునీటి శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించగా.. ఈసారి మాత్రం దాన్ని కేసీఆర్ తన వద్దే పెట్టుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో హరీశ్ రావుకు ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది. ఇక గతంలో ఆర్థికశాఖ నిర్వహించిన ఈటెల రాజేందర్ కు ఈసారి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కు మాత్రం యధావిధిగా ఐటీ శాఖను కేటాయిస్తారని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: