సినీ నటుడు శివాజిపై పోలీస్ కమీషనర్ కు వైసిపి నేతల పిర్యాదు

ఆపరేషన్ గరుడ ఒక ఇంటరెస్టింగ్ టైటిల్ దీనితో పాటు ద్రవిడ, రాక్షస పేర్లు కూడా సృష్టించారు. జనాన్ని భయపెట్టేలాగా అల్లిన చరిత్ర తో ఈ టైటిల్స్ వాటి ద్వారా భవిష్యత్ లో దక్షిణ భారతానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు రానున్న ఉపద్రవం వింటే ఒళ్ళు జలదరిస్తుంది. వీటి సృష్టికర్త తెరపై సినీ నటుడు శొంఠినేని శివాజి. ఈయన "మిస్సమ్మ" సినిమాలో భూమిక, లయ కథానాయికల మద్య నటనతో మాత్రమే తెలుగు ప్రజలకు బాగా గుర్తుంటారు.


అంతకు మించి ప్రజలు మెచ్చిన ఈయన చేసిన చెప్పుకోదగ్గ సినిమా లేమీ లేవు. చిత్రసీమలో పనిలేక మూలనపడ్డ ఈయనకు పునరావాసం కల్పించింది ఈ ఆపరేషన్ ద్రవిడ.. గరుడ.. రాక్షస.  తన బ్రతుకు దెరువు కోసం శివాజి ఈ పేర్లతో చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు అంటున్నారు వైసిపి నాయకులు కార్యకర్తలు. 
 
అయితే తెరవెనుక నేపధ్యం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ స్క్రీన్-ప్లె నిర్మాణత దర్శకత్వం తో ఆయ్న కనుసన్నలలోనే "ఆపరేషన్ గరుడ" అమలు చయ్బడుతుందని వైసిపి నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతం రెడ్డి కలసి ఆరోపించారు. 'ఆపరేషన్ గరుడ" కుట్రలో పాత్రదారుడైన నటుడు శొంటినేని శివాజీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు నేడు (సోమవారం) విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కు ఫిర్యాదు చేశారు. 

ఆపై మీడియాతో మాట్లాడుతూ, నటుడు శొంటినేని శివాజీ చౌదరి ని ఉపయోగించి నారా చంద్రబాబు నాయుడు ఈ కుట్ర కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పై జరిగిన హత్యా యత్నం ఆ కుట్రలో భాగమేనని అన్నారు.  కోడి పందెంలో కోడికాళ్లకు కట్టే పదునైన కత్తితో వైఎస్ జగన్మోహన రెడ్డి హత్యకు ప్రయత్నించిన శ్రీనివాస్‌ తో పాటు చంద్రబాబు నాయుడు, ఈ శివాజీ చౌదరిలను విచారించాలని డిమాండ్ చేశారు.

శొంఠినేని శివాజీ చౌదరి గరుడ పురాణం చెప్పడం.. శ్రీనివాస రావు హత్యాయత్నం చేయడం.. ఖచ్చితంగా శివాజీ చౌదరి ముందే చెప్పాడంటూ నారా చంద్రబాబు నాయుడు సమర్ధించడం 100% ఆయన చెప్పిన కథను అలాగే అమలుపరచటం ఆ కథ చెప్పిన, చెప్పించిన వారికే, సాధ్యం అంటున్నారు. అందుకే దీనిని కుట్ర అనేందుకు ఆ కథా విధానమే చక్కటి ఋజువని అంటున్నారు. "ఆపరేషన్ గరుడ కుట్ర" పేరుతో మాట్లాడుతున్న శొంఠినేని శివాజీ చౌదరిపై, అనామకుడు ఎలాంటి సామాజిక బాధ్యతలు నిర్వహించని ఈ సామాన్యుణ్ణి సమర్ధిస్తూ మాట్లాడుతున్న టిడిపికి చెందిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని కమిషనర్‌ కు ఫిర్యాదు చేసినట్లు వైసిపి నాయకులు చెప్పారు. శొంఠినేని శివాజీని చట్టబద్ధంగా రాజ్యాంగసంస్థలతో విచారణ  చేయిస్తే, ఈ సమాచారం అందించిన వారెవరో వెంటనే బయటకు వస్తారన్నారు.

అలాగే ఈయనకు ఏ ఆధారం చూపని ఈయన మాటలకు విపరీత ప్రచారం చేస్తున్న తెలుగుదేశం వందిమాగదులకు అంతే వేగంగా వేనోళ్ళ ప్రచారం కలిపిస్తున్న ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారంలో ఆధారాలు, మూలాలు పరిశీలించాల్సిందేనని అమరావతి వాసుల వాదన. 

 
 

ఆపరేషన్ యెల్లో ఫ్లవర్- చెవులో పెట్టుకొని వచ్చి శివాజి మన చెవుల్లోకి మార్చాలని చూస్తున్న పిచ్చిపువ్వు! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: