రాజమండ్రి బ్రిడ్జి పై తన కవాతు ను వాయిదా వేసుకున్న పవన్ కళ్యాణ్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీని బలోపేతం కోసం ప్రజా సమస్యలపై అవగాహన కోసం ప్రజా పోరాట యాత్ర అంటూ పవన్ ఇప్పటికే ఉత్తరాంధ్ర పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.


ఈ క్రమంలో త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర చేయబోతున్నట్లు జనసేన పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం . ఈ క్రమంలో రాజమండ్రి బ్రిడ్జి పై ఇటీవల అక్టోబర్ 9వ తారీఖున జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ మరియు అభిమానులు కవాతు చేయడానికి రెడీ అయిన విషయం మనకందరికీ తెలిసినదే.


అయితే తాజాగా జనసేన పార్టీ అక్టోబర్ 9వ తారీఖున రాజమండ్రి వంతెన పై పవన్ కళ్యాణ్ చేపట్టే కవాతు ప్రోగ్రాం ని వాయిదా వేశారట. తక్కువ సమయం టెక్నికల్ అంశాల నేపథ్యంలో వాయిదా వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రెండు గోదావరి జిల్లాలకు చెందిన నేతలు కోరారట.


కొవ్వూరు రోడ్డు కం రైల్ బ్రిడ్జి కేపాసిటీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం నిపుణుల సలహా మేరకు గోదావరి జిల్లాల జనసేన పార్టీ నాయకులు తీసుకున్నారు. అయితే తాజా ప్రకటనతో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు నిరుత్సాహం చెందారట. మరోపక్క ఇదే విషయాన్ని విజయవాడలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో సమావేశం అయిన తరువాత అధికారికంగా తెలియజేస్తారని జనసేన పార్టీకి సంబంధించిన వారు అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: