ఐటి - భూ - కుంభకోణం సూత్రధారి ముఖ్యమంత్రి తనయుడు ఐటి మంత్రి లోకెష్

నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కాని వందల వేల సంఖ్యలో ఐటి కంపనీలు విదేశాలనుండే కాక స్వదేశం నుండి కూడా ఏపిలో వరదలాగా ప్రవహించాయని నాలుగు లక్షల ఉద్యోగలు ఇచాము, ఇస్తున్నాము, ఇవ్వబోతున్నామని, దేశంలోనే అత్యంత ప్రగతి సాధినచిన రాష్ట్రం ఏపియేనని తండ్రి తనయులు నోరును మైక్ చేస్తూ దొరికిన సంధర్భాన్ని అంటే శాసనసభ నుండి బహిరంగసభలవరకేకా గల్లి sసభలలో సైతం ప్రవచిస్తూనే ఉన్నారు.


అదంతా ఉత్తిదేనని ఒకప్రక్క వైసిపి, మరోప్రక్క జనసేన, ఇంకోపక్క బిజెపి కాలుకు బలపం కట్టుకొని దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యతిరేఖ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని ఏ రకంగానూ వదలకూడదని భారతీయ జనతా పార్టీ తీర్మానించుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.


ఇన్నాళ్లూ తెలుగుదేశం నాయకులపై కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైన భాజపా నాయకులు ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం మంత్రులపై న్యాయస్థానాల తలుపు లు తట్టాలని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు బీ.వీ.ఎల్.నరసింహారావు వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖామాత్యులు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై ఈ న్యాయస్థానాస్త్రం ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు జీవీఎల్ నరసింహారావు. ఇంతకీ ఏ విషయంలో కోర్టుకు వెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీల పేరుతో జరుగుతున్న ఎమోయూల ద్వారా షెళ్ కకోట్లాది రూపాయల కుంభకోణాలపై తాను కోర్టుకు వెళ్తానని జీవీఎల్ ప్రకటించారు.


వివిధ కంపెనీలకు ప్రోత్సాహకాల పేరుతో షెల్ కంపెనీలు సృష్టించారని, ఈ ఫిక్టీషియస్ కంపనీల ద్వారా అస్మదీయులు ముఖ్యంగా లోకెష్ దగ్గర బంధువులు రాష్ట్ర      భూ సంపదను తమ చిత్తానికి తగ్గట్టు దోచేశారని కమలనాధుల ఆరోపణ. ఐటి ఐటిఈయెస్ అనే ఒక విభాగాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్సడ్డారని తీవ్ర విమర్శలు చేశారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖలో వేలాది తన ఫోర్టిఫోలియో లోనే కోట్ల రూపాయలు చేతులు మారాయనడానికి పధకం రచించి - గడచిన నాలుగేళ్లలో అధికారులకు ప్రజలకు వెలువరించని జీవోలను విడుదల చేసి తద్వారా జాతి సంపదను దండుకుంటున్నట్లు పేర్కొన్నారు జీవిఎల్ అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి? అవి ఎక్కడెక్కడ వచ్చాయి? అనే అంశాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు రాకపోయినా - ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్ల రూపాయలు దండుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఆ పేరుతో భూములను దోచేసి తమ బంధువర్గానికి కట్తబెట్తారు. అలాగే మౌలిక వసతులపేరుతో వేల కోట్లు వారికే దారాదత్తం చేసినట్లు తెలుపుతూ వీటిపైనే ప్రధానంగా న్యాయస్థానాలను  ఆశ్రయించాలన్నది జీవీఎల్ నరసింహారావు ప్రధాన ఉద్దేశ్యం.


ఈ ఐటీ కుంభకోణంలో మరో ప్రధాన అంశం ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూముల ధర నామమాత్రంగా నిర్ణయించి ఇంకా రహస్య ప్రయోజనమేమంటే మూడు సంవత్సరాల తర్వాత అంటే తమ పాలనా కాలం ముగిసే నాటికి వీటిని వాణిజ్య దరలకు అమ్ముకోవడానికి కూడా ఈ జీవోల ద్వారా వీలు కల్పించారన్నది ప్రధాన ఆరోపణ.దీని ద్వారా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ అని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.


ఐటీ శాఖలో ఇప్పటి వరకూ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని కంపెనీలు ప్రారంభించారు? అనే అంశాలపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సమాచారం కూడా ఇవ్వకపోవడం, ఆర్టీఇ ద్వారా సంప్రదిస్తే తమ వెబ్ సైట్ లో చూసుకోమంటం జరుగుతుంది. ప్రభుత్వ వెబ్ సైట్స్ అన్నీ "పాస్వర్డ్ ప్రొటెక్షన్ తో  ఉంచటం సైట్స్ ఓపెన్ కాకపోవటం" వల్లే తాను న్యాయస్థానాల తలుపులు తట్టాలని నిర్ణయించుకున్నానని కమలనాథుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: