అహింసే మహాత్ముడి ఆయుధం..

Edari Rama Krishna

సాధారణంగా ఏదైనా సిద్ధాంతం కాలానుగుణంగా మార్పులు సంతరించుకుంటూ ఉంటుంది. అది ఎలాంటిదైనా కావచ్చు. కాలంతో పాటు మార్పు చెందకపోతే దానికి వాల్యూ ఉండదు. కానీ అన్ని సిద్ధాంతాలు ఆ కోవలోకి రావు. కొన్నింటికి అంతముండదు. అలాంటివాటిలో ఒకటి గాంధీయిజం ఒకటి. అసలేంటీ గాంధీయిజం. గాంధీ చేసిన గొప్పేంటి. ఆయన్ను ఎందుకు జాతిపితగా భావిస్తున్నాం. ఈనెలలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా జాతిపితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


సత్యం – అహింస

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గాంధీ సిద్ధాంతాలివి. సత్యంతో ఎంతటివారినైనా గెలవచ్చుననేది గాంధీ మాట. అలాగే అహింస ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తుందని బలంగా నమ్మినవ్యక్తి. పైగా తాను అనుసరించింది మాత్రమే గాంధీ ఇతరులకు చెప్పేవారు. సత్యం, అహింసలతోనే ఆయన స్వాంతంత్ర్య పోరాటం చేశారు. సహాయనిరాకరణోద్యమం అంత పెద్దఎత్తున జరిగినా.. ఎక్కడా హింసకు తావులేదు. పైగా ఈ రెండు సిద్ధాంతాలతోనే దేశం మొత్తాన్నీ గాంధీ ఏకం చేశారు. అందుకే గాంధీజీని ‘వన్ మ్యాన్ ఆర్మీ’ అని భారత తొలి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ కొనియాడారు. అప్పటివరకూ రెచ్చిపోతున్న అతివాదులు .. గాంధీ పోరాటంతో కాస్త నెమ్మదించారు. సహాయనిరాకరణోద్యమంలో ఓసారి ప్రజలు పోలీస్టేషన్ ను తగలబెట్టారు. ఇది తెలుసుకున్న గాంధీజీ.. మొత్తం ఉద్యమాన్నే నిలిపేశారు. అదీ అహింసపై ఆయనకున్న పట్టుదల, నమ్మకం.


సంస్కృతి – సంప్రదాయం

భారతదేశ సంస్కృతి సంప్రదాయాలపట్ల గాంధీజీకి ఎనలేని మక్కువ. చదువుకోసం బ్రిటన్ వెళ్లినా.. ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికా వెళ్లినా.. ఏనాడూ భారతీయతను మర్చిపోలేదు. ‘ఇంట్లో అన్ని గదుల్లోకి వెలుగునిచ్చే సంస్కృతి నాది’ అన్నారంటే ఆయనకు మన సంస్కతిపట్ల ఉన్న నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సంస్కృతిని ఆయన బలంగా నమ్మారు. దాన్ని తుదివరకూ పాటించారు. నమ్మిన సిద్ధాంతంకోసం ఆయన పోరాడు. కొంతమంది ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించారు. అయినా ఆయన మాత్రం తప్పయినా, ఒప్పయినా దాన్నే అనుసరించారు.


గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యం

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆనాడే చెప్పిన మహానేత గాంధీజీ. “గ్రామాల్లోనే దేశం ఉంది. గ్రామాలు అంతరిస్తే దేశం అంతమైపోయినట్లే. అందుకే గ్రామాల్లో కుటీరపరిశ్రమలను ప్రోత్సహించాలి.” అని మహాత్ముడు చెప్పారు. పెద్ద పరిశ్రమలో ఆర్థిక వికేంద్రీకరణ జరగదని భావించిన గాంధీజీ.. గ్రామాల్లో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు ఉండాలని ఆకాంక్షించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: