శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ ఎన్నికలకు ప్లాన్లు సూచించిన రాహుల్ గాంధీ..!

KSK
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా కే సి ఆర్ ని గద్దె దింపడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించడానికి రెడీ అయిపోతుంది. ఈ క్రమంలో కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలను వివిధ రాజకీయ నాయకులను ఏకం చేసి మహాకూటమిగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ఈ నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కర్నూలు భారీ బహిరంగ సభలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళుతున్న క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు.


2014 ఎన్నికల్లో చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని, ఐక్యత లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని ఈ ఎన్నికల్లో అలాంటివి రాకుండా చూడాలని నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. అలాగే పొత్తులతో పార్టీ నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.


వీటితోపాటు ప్రచార కమిటీ, మేనిఫెస్టో, కూటమిలో సీట్ల సర్ధుబాటుపై చర్చించారు. పొత్తులో పార్టీ నష్టపోకుండా చూడాలని రాహుల్ ఈ సమావేశంలో ఆదేశించారు. ఈ భేటీలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మధుయాష్కీలు రాహుల్ తో భేటీ అయ్యారు….సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: