జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కృష్ణంరాజు..?

KSK
ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయి. రాబోయే ఎన్నికలలో ఆంధ్రరాష్ట్రంలో మూడు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ పోరు ఉండటం తప్పేటట్లు లేదు. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పార్టీ కి పోటీగా మహాకూటమి ఏర్పడుతుండగ...మరోపక్క ఆంధ్రరాష్ట్రంలో  ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు పొత్తుల విషయంలో.


ఇదిలావుండగా 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన జనసేన పార్టీ...ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోటీకి సిద్దపడుతోంది. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ తరఫున ప్రజాపోరాట యాత్ర చేసి ఆంధ్ర రాజకీయాలను వేడి పెంచిన అధినేత పవన్...రెండవ విడతలో త్వరలో పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు.


ఇప్పటికే ఈ జిల్లాలలో సగం నియోజకవర్గాలలో పవన్ యాత్ర చేయడం జరిగింది. ఈ క్రమంలో మంచి దూకుడు మీద ఉన్న పవన్ ఇటీవల జనసేన పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లా చెందిన పితాని బాలకృష్ణను బి ఫామ్ నాయకుడిగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణం రాజును ప్రకటించాలని ఆలోచనలో ఉన్నారట.


పశ్చిమగోదావరి జిల్లాలో సామాజిక వర్గాల పరంగా ఆలోచిస్తే తెలుగుదేశం ,వైసీపీ లు ఇరువురూ కూడా ఎంపీ అభ్యర్ధులుగా క్షత్రియ సామజిక వర్గానికి చెందినా వారినే అభ్యర్ధులుగా నిలబెడుతూ వస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: