ఆ విషయంలో సమంతనే దాటేసిన శోభిత..!?

Anilkumar
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న చాలామంది జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తూ హీరోయిన్స్ గా మంచి గుర్తింపును దక్కించుకుంటున్నారు. ఇక అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ సైతం డిమాండ్ చేస్తున్నారు. అలా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికి కూడా కనీసం ఇల్లు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ

 సమయంలోనే  కోట్ల ఆస్తులను కూడా పెట్టుకుంటున్నారు. అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ లిస్టు లోకి చేరింది నటి శోభిత ధోళిపాల. తెలుగులో ఒకప్పుడు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు హిందీలో బాగా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో కూడా ఇప్పటికీ హవా కొనసాగిస్తున్న ఈమె ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి. కానీ దానిపై ఎప్పుడు స్పందించలేదు శోభిత. ఇదిలా ఉంటే ఇక ఈమెకి

 సంబంధించిన ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఈ ముద్దుగుమ్మ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడలింగ్ చేస్తూ కెరీర్ని ప్రారంభించిన ఈమె రామన్ రాఘవన్ అనే సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత గుడాచారి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఈమె ఇటు తెలుగు అటు బాలీవుడ్లో సైతం వరుస సినిమాలతో బిజిగా ఉంది. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే కోట్ల ఆస్తి సంపాదించుకుంది.  అయితే ప్రస్తుతం ఈమె ఒక్కొక్క సినిమాకి గాను కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా  ఈమె 20 నుండి 30 కోట్లకు పైగానే ఆస్తులను కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. నిజానికి సమంత ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా చాలావరకు ఇంత మొత్తంలో ఆస్తులు కూడబెట్ట లేకపోయింది. ఇక ఈ విషయంలో సమంతనే దాటేసింది శోభిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: