జూ. ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్ : కోహ్లీ

praveen
టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడుగా మారడనే కాదు.. అందరికీ ఫేవరెట్ క్రికెటర్ గా మారాడు విరాట్ కోహ్లీ. తన ఆట తీరుతో ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియాకు కెప్టెన్ గా ఎన్నో రోజులు పాటు సేవలు అందించాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక ఇప్పుడు జట్టును విజయ తీరాలకు నడిపించే ఒక బ్యాక్ బోన్ లాగా టీం ఇండియాలో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే సోషల్ మీడియాలో కూడా ఏ క్రికెటర్ కు లేనంత ఫాలోయింగ్ విరాట్ కోహ్లీ సొంతం. అందుకే కోహ్లీ గురించి ఏ చిన్న విషయం వెలుగులోకి వచ్చిన అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవలే ఒక టాలీవుడ్ స్టార్ హీరో గురించి విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఏకంగా టాలీవుడ్కు చెందిన ఒక స్టార్ హీరో తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ విరాట్ కోహ్లీ ఇలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది ఎవరినో కాదు.. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ని. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా సరే సరదాగా ఉంటూ అందరికీ ఇట్టే నచ్చేస్తూ ఉంటాడు.

 మన ఇంటి మనిషి అనిపించేలాగా అందరితో సరదాగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీకి కూడా జూనియర్ ఎన్టీఆర్ లో ఇదే నచ్చిందట. టాలీవుడ్ లో తనకు జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్ అని భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చెప్పారు. ఓ యాడ్ లో కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ఇక త్రిబుల్ ఆర్ లో ఉన్న ఎన్టీఆర్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. నాటు నాటు పాటకు నా భార్యతో కలిపి డాన్స్ కూడా చేశాను. ఇక ఈ పాటకు ఆస్కార్ వచ్చింది అన్న విషయం తెలిసి ఏకంగా మైదానంలో కూడా ఈ పాటపై డాన్స్ చేశాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: