ఆ ఒక్క పోస్ట్ తో రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సలార్ మేకర్స్..!?

Anilkumar
సలార్ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు కల్కి సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను

 రాబట్టింది. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇంతటి బ్లాక్ బాస్టర్ అందుకోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే సలార్ పార్ట్ 2 ఉంటుంది అని చెప్పారు మెకర్స్. దీంతో సలార్ 2 అప్పుడప్పుడు వస్తుందా అని ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే గత కొద్ది రోజులుగా సలార్ 2 పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు సలార్ 2 ఆగిపోయింది అనీ

 సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. డైరెక్టర్ ప్రభాస్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా ఆపేశారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే తాజాగా ఆ రూమర్స్ కీకి చెక్  పెట్టారు హోంబులే ఫిలిమ్స్ సంస్థ. సలార్ సెట్స్ లో ప్రభాస్ ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించిన ఒక ఫోటోను తాజాగా షేర్ చేస్తూ వీళ్ళు నవ్వకుండా ఉండలేరు అంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం వారిద్దరికీ సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోయే సలార్ 2 ప్రాజెక్టుకు శౌర్యాంగ పర్వం టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకే మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 27న డార్లింగ్ నటిస్తున్న కల్కి ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: