కిరణ్ దిల్ రూబా.. అదే తొందరపాటా..?

shami
తన కెరీర్ అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరికి క సినిమాతో తన సత్తా చాటి చూపించాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. క సినిమా చూసిన ప్రతి ఒక్కరు అతనిలో ఉన్న కసి ఏంటన్నది అర్ధమైంది. క సినిమా తర్వాత కిరణ్ చేస్తున్న సినిమాపై అందరి చూపు ఉంది. క తో కెరీర్ మళ్లీ గాడిన పడగా నెక్స్ట్ సినిమా ఎలాంటి కథతో వస్తాడా అన్న డౌట్ మొదలైంది.
ఐతే క సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం దిల్ రూబా అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను విశ్వ కరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రుక్సర్ థ్రిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు. కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాను 2025 ఫిబ్రవరికి రిలీజ్ ఫిక్స్ చేశారు.
కిరణ్ ఒక సినిమా హిట్ పడగానే మళ్లీ తన వేగాన్ని పెంచాడు. ఐతే ఈసారి నుండైనా కథల విషయంలో జాగ్రత్త పడతాడా లేదా అన్నది చూడాలి. క సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర టైం తీసుకున్న కిరణ్ ఆ సినిమా హిట్ పడగానే నెక్స్ట్ సినిమా ప్రకటన రిలీజ్ డేట్ కూడా వదిలాడు. మరి మళ్లీ కిరణ్ ఎందుకు అంత తొంద పడుతున్నాడా అని డౌట్ పడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్సర్ థిల్లన్ కూడా ఆల్రెడీ ఫేడవుట్ అయిపోయింది మరి కిరణ్ ఎంపిక మీద స్పష్టత రావాలంటే మాత్రం సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. కిరణ్ ఈసారి మళ్లీ హిట్ ట్రాక్ తప్పితే మాత్రం చాలా నష్టం భరించాల్సి ఉంటుంది. మరి కిరణ్ కథల ఎంపిక విషయంలో వస్తున్న ఈ డౌట్లు అన్నీ కూడా తన సినిమాలతో సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: