పెళ్లయ్యాక ఏంటీ ఇది...ఆ హీరో దగ్గరకు వెళ్లిపోయిన కీర్తి సురేష్...?
కాగా కీర్తి సురేష్ తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వీరిద్దరూ 15 సంవత్సరాల పాటు ప్రేమించుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. గోవాలో డిసెంబర్ 12న జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. కాగా, కీర్తి సురేష్, ఆంటోనీల వివాహం హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతులలో అత్యంత వైభవంగా జరిగింది.
వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన సినీ ప్రముఖులు చాలామంది విషెస్ తెలియజేశారు. అభిమానులు ఈ ఫోటోలు చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మొదట కీర్తి సురేష్, ఆంటోనీలు అయ్యంగార్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
అనంతరం క్రిస్టియన్ పద్ధతి లో వివాహం చేసుకున్నారు. అయ్యంగార్ పద్ధతిలో వివాహం చేసుకున్న సమయంలో దళపతి విజయ్ వీరిద్దరిని ఆశీర్వదిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడికి విజయ్ సాంప్రదాయ పంచకట్టు, తెల్లచొక్కాలో సింపుల్ లుక్ లో కనిపించాడు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి జరిగిన అనంతరం విజయ్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది. కాగా, అటు హీరో విజయ్, హీరోయిన్ త్రీషా ఇద్దరు కలిసి.. హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వెళ్లినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.