టీచర్ - స్టూడెంట్ రొమాంటిక్ డాన్స్.. తిట్టిపోస్తున్న నేటిజన్స్?

praveen
తల్లి తండ్రి తర్వాత గురువే ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే తల్లి తండ్రి జన్మను ఇస్తే ఆ జన్మను సరైన మార్గంలో నడిపించేది గురువు మాత్రమే. ఇక లోకం తీరును నేర్పించేది.. ప్రయోజకులను చేసేది గురువే. అందుకే ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినవాడైనా సరే ఇక ఒకప్పుడు ఒక గురువుకి శిష్యుడే అని అంటూ ఉంటారు. అందుకే ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా గురువులను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారో చాలా మంది వ్యక్తులు.

 అందుకే ఉపాధ్యాయులకు అంత గౌరవం ఉంటుంది. కానీ నేటి రోజుల్లో మాత్రం కొంతమంది ఉపాధ్యాయులు ఏకంగా గురువృత్తికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా సొంత పిల్లల అనుకోవలసిన స్టూడెంట్స్ తోనే చేయకూడని పనులన్నీ చేసేస్తున్నారు. కొంతమంది టీచర్లు అయితే ఏకంగా వారి దగ్గర చదువుకునే ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఇంకొంతమంది టీచర్లు స్టూడెంట్స్ తోనే ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక టీచర్ చేసిన పని కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.

 సాధారణంగా టీచర్లు తమ దగ్గర చదువుకుంటున్న పిల్లలకు డాన్సులు నేర్పించడం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక టీచర్ డాన్స్ నేర్పించడం కాదు ఏకంగా తన స్టూడెంట్ తో ఒక రొమాంటిక్ పాటపై రొమాంటిక్ డాన్స్ చేసింది. ఆషీకీ సినిమాలోని తుమ్ హి హో అనే పాటపై ఇక స్టూడెంట్ టీచర్ డాన్స్ తో రెచ్చిపోయారు. క్లాస్ రూమ్ లో అందరూ చూస్తుండగానే ఇలా డాన్స్ లో మునిగి తేలారు. అయితే టీచర్ స్టూడెంట్ ఇలా డాన్స్ చేస్తుండగా అటు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా లీలలు గోలలతో రెచ్చిపోయారు. ఇక ఇది వైరల్ గా మారగా పాటలు చెప్పాల్సింది పోయి.. ఇలాంటి రొమాంటిక్ పాటలు నేర్పించడం ఏంటి అంటూ ఎంతోమంది నైటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: