రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో తన పాత్ర ఏంటో లీక్ చేసిన అంజలి..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిగా పరిచయమైన అంజలి ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం అదే జోరు చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మళ్లీ 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

 ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ చెంజర్ సినిమా పై పులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది అంజలి. అయితే గేమ్ చేంజర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది అంజలి. ఇక అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా గురించి ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడలేనని చెప్పుకొచ్చింది. అలా చెప్పుకొస్తూనే కొన్ని విషయాలను కన్ఫర్మ్ చేసింది.. దీంతో ఆమె చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే తనది గేమ్  సినిమాలో ఎలాంటి కీలక పాత్ర కాదు అని.. కేవలం ఒక హీరోయిన్

 పాత్ర మాత్రమే అని చెప్పుకొచ్చింది. తనకు ఫ్లాష్ బ్యాక్ లోనే ఎక్కువ కద ఉంటుంది అని ఒక అద్భుతమైన పాట కూడా తన మీద కంపోస్ చేశారు అంటూ ఇందులో భాగంగా వెల్లడించింది. ఇక ఈ విషయం గురించి తను మాట్లాడడం కంటే దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ రాజు మాట్లాడితేనే బావుంటుంది అని తెలిపింది. అంతేకాదు తనకు సినిమా గురించి బయట ఎక్కడా కూడా ఎటువంటి విషయాలను లీక్ చేయకూడదు అన్న సూచనలు ఉన్నాయి అంటూ తెలిపింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఇప్పటివరకు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి ముందు ముందు ఎటువంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ. హీరోయిన్ గా నటిస్తోంది త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: