
పవన్ కళ్యాణ్ గెలుపుపై వేణు స్వామి సంచలన జోష్యం..??
పవన్ కళ్యాణ్ జాతకంలో రాజయోగం లేదని, అందువల్ల ఆయన పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని వేణు స్వామి సెన్సేషనల్ జోస్యం చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కూడా పవన్ పాలించే స్థాయికి అస్సలు చేరుకోలేరని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులకు మింగుడు పడటం లేదు.
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, వేణు స్వామి జోస్యం నిజం అవుతుందా లేదా అనేది ఆ తేదీన తేలిపోనుంది. ఆయన చెప్పిన ప్రేడిక్షన్ అభిమానుల్లో వాడివేడి చర్చలకు కారణమయ్యింది. బెట్టింగ్ చేస్తున్న వారు కూడా వేణు స్వామి జోష్యం వల్ల ప్రభావితం అవుతున్నారు. బీజేపీ, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జనసేన టికెట్‌పైనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఆయన చంద్రబాబు, మోదీతో పొత్తు కుదుర్చుకున్నారు. చాలా తక్కువ సీక్రెట్ కేటాయించిన వాటితోనే సరిపెట్టుకున్నారు. చంద్రబాబుతో అన్ని విధాలా సహాయం చేశారు.
అంత కష్టపడిన పవన్ కళ్యాణ్ ఓడిపోతే జనసైనికులు బాగా బాధపడిపోతారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఏదో ఒక మంచి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇకపోతే సమంత, నాగ చైతన్యలు వేణు స్వామి ముందే చెప్పారు. అదే జరగడంతో ఆయనకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆయన అంచనాలు నిజమవుతాయా అని చాలామంది భయపడుతున్నారు.