నందమూరి కలయిక రాజకీయ సమీకరణాలు మార్పు...!

Prathap Kaluva

హరికృష్ణ మరణం తో రెండు నందమూరి కుటుంబాలు అంటే హరికృష్ణ ఫ్యామిలీ బాలయ్య కలిసిపోతున్నడం గమనించ వచ్చు. ఇప్పటివరకు రాజకీయ కారణాలతోనే రెండు కుటుంబాలు కలుసు కోలేక పోయాయి ఇది నిజం ఈ విషయం అందరికీ తెలిసిందే.  నందమూరి హరికృష్ణ కుటుంబానికి, నందమూరి బాలకృష్ణ కుటుంబానికి మధ్య అంత సయోధ్య లేదని చిరకాలంగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరంగా వుంచాలని ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ ను అవమానపరిచే విధంగా చాలా వ్యవహారాలు జరిగాయి.


గత ఎన్నికల ముందు ఎన్టీఆర్ జగన్ వైపు మొగ్గాడని, అందుకే పార్టీ అతన్ని దూరం పెట్టిందని వదంతులు పుట్టించారు. అలాగే బాలయ్యతో ఎందుకో కలయిక ఆగిపోయింది. ఒక్క కళ్యాణ్ రామ్ మాత్రమే కాస్త ఇటు ఎన్టీఆర్ కు అటు బాలయ్యకు మధ్యలో వారథిలా వుంటూ వచ్చారు. ఎన్టీఆర్ కూడా ఇంటర్వూలు ఇచ్చేముందు, బాబాయ్ సంగతులు, రాజకీయాలు అడగవద్దని షరతుపెట్టిన సందర్భాలు వున్నాయి.


ఇలాంటి నేపథ్యంలో హరికృష్ణ మరణించిన వెంటనే సినేరియా అంతా మారిపోయింది. గత మూడు రోజులుగా బాలయ్య బాబు పూర్తిగా ఎన్టీఆర్ తో కలిసే వున్నారు. ఎన్టీఆర్-బాలయ్య ముచ్చటించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కు రాజకీయాల మీద పూర్తిగా ఆసక్తి పోయినట్లు ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా. చంద్రబాబుకు హరికృష్ణతో సమస్య. అందుకోసమే బాలయ్యను లైన్లో పెట్టారు. ఇప్పుడు హరికృష్ణ లేరు. ఇక ఎన్టీఆర్ కు కూడా అనవసరపు పోరాటాలు ఎందుకన్న భావనరావచ్చు. అందువల్ల ఇక రాజకీయంగా నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే అయిపోయినట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: