అవినీతి అక్రమాలు చేస్తున్న కుప్పం టిడిపి నాయకుల పై మండిపడ్డ లోకేష్..!

KSK
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర మంత్రి అయిన నారా లోకేష్ ప్రస్తుతం చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ ఏ విషయానికైనా ముఖ్యమంత్రి, తన వద్దకు వస్తే వ్యక్తిగత సమస్యలు చెప్తారే తప్ప, ప్రజాసమస్యలు, పార్టీ స్థితిగతులను పట్టించుకోలేదని అన్నారట.

‘ ప్రతి ఒక్కరి విషయాలు నాకు తెలుసు.. అధికారం వచ్చినప్పటి నుంచీ అవినీతి, కబ్జాలు, వసూళ్లు అధికమయ్యాయని మండిపడ్డారు. ఎన్‌టీఆర్‌ గృహ కల్పనలో మంజూరైన ఇళ్లకు డబ్బులు తీసుకుంటారా..? పెన్షన్లకు డబ్బులు తీసుకుంటారా..? ఎక్కడ చూసినా కబ్జాలు చేస్తున్నది మీరే.. ఇదేమి కుప్పం... పరిస్థితి ఇలా తయారైంది ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

‘రోడ్డు విస్తరణలో రెండో రీచ్‌ పనులు దౌర్జన్యంగా చేస్తారా..? అధికారుల వద్ద చేయించాలే తప్ప మీరే బహిరంగంగా దిగి ప్రజలను ఇబ్బందిపెడితే ఎలా ? ’ అంటూ నేతలపై కేకలు వేశారు.

కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీ బంధు మిత్రుల కోసం ఇంటి వారి కోసం ఖర్చు చేస్తారా అంటూ కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం నాయకుల పై మండిపడ్డారు లోకేష్. ప్రతి ఒక్కరి జాతకం నాకు తెలుసు అని ఇలానే చేసుకుంటూ పోతే తగిన సమయంలో అందరి విషయాలు బయట పెట్టి బొక్కలో పెడతామని హెచ్చరించారట నారా లోకేష్..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: