మోదీ గుండెల్లో చలిమంటలు పుట్టిస్తున్న మమతా బెనర్జీ

మమత బెనర్జీ ఆధునిక రాజకీయాల్లో ఉక్కు మహిళ గానే చెప్పొచ్చు. తను నిర్ణయం ఏదైనా తీసుకుంటే ఇక వెనుదిరిగి చూడరు. కార్యోన్ముఖురాలై పోతారు. ఇది మన ఫెడరల్ ఫ్రంట్ కెసిఆర్ కు తొలి ప్రయత్నంలోనే బాగ అవగతమైందనుకుంట. అందుకే ఆమె ప్రత్యేకం.  మూలాల నుండి పాలించటం తెలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ మోదీకి మాత్రం కాలిలోన రాయి, కంటిలోని నలుసు, చెవిలోన జోరీగ లాంటిదే అని మరోసారి ఋజువు చేసుకున్నారు. అదీ ఎన్నికల పంచాయతీ ఎన్నికల సమరాంగణంలో. ఒక రకంగా బహుశ దేశంలోనే సంచలనం. సీఎం మమతా బెనర్జీ ఒకరకంగా అదరగొట్టారు. 

ఒక్క ఓటు పోలవకుండానే 34శాతం పంచాయతీ స్థానాలను కైవసం చేసుకొని దీదీ సామర్ధ్యం ఏమిటో మరోసారి నిరూపించారు. అంటే ఆయుధం పట్టకుండా భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్రాన్ని గెలవటం అన్నట్లు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగకముందే మూడో వంతుకు పైగా స్థానాలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోవడం అసలు ఆస్చర్యకర పరిణామం. సరైన ప్రత్యర్థి లేకపోవడంతో ఆ స్థానాల్లో సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయ్యింది. ఇంత భారీ సంఖ్యలో పంచాయతీ సీట్లు ఏకగ్రీవం కావడం బెంగాల్‌ చరిత్ర లోనే ఇది తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు  ఏకగ్రీవంగా గెలుచుకుంది.
Even before the May 14 local body elections in West Bengal, CM Mamata Banerjee's TMC has won a stunning 34% seats unopposed.

మొత్తం 58,692 పంచాయతీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌ లో మే 14న స్థానిక ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిలో 20000పైగా స్థానాల్లో 'తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి' మినహా ఎవరూ పోటీలో నిలబడలేదు. అందువల్ల ఆ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. కొందరు తమ నామినేషన్లను వెనక్కి తీసు కోవడం, మరికొందరి నామినేషన్లు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరణకు గురవడం, ఇలాంటి కారణాల వల్ల ఈ స్థానాల్లో ఎలాంటి పోటీ జరగట్లేదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రోజు నుండే పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్షపార్టీ కోర్టుకు కూడా వెళ్లింది. తమను నామినేషన్‌ వేయనీయకుండా అధికారపార్టీ అడ్డుకుంటోందని ఆరోపించింది. దీంతో ఎన్నికల కమిషన్‌ 9మంది అభ్యర్థుల దరఖాస్తులను వాట్సాప్‌ ద్వారా కూడా స్వీకరించడం గమనార్హం.రాష్ట్రంలో టీఎంసీ కార్యకర్తలు విపక్ష అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

టీఎంసీ కార్యకర్తల చర్యలకు బయపడి అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి భయ పడ్డారని, తృణమూల్‌ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ఆధీర్‌ రాజన్‌ చౌదరీ విమర్శించారు. టీఎంసీ నేతలు సామాన్యుల రాజకీయ హక్కును హరిస్తున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల బీర్బూమ్‌లో జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయలైన విషయం తెలిసిందే.

నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం 58,693 స్థానాలకుగాను అధికార తృణమూల్‌ కాంగ్రెస్ నుంచి 72,000, బీజేపీ నుంచి 35,000, వామపక్ష పార్టీల నుంచి 22,000, కాంగ్రెస్‌ నుంచి 10,000 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు మొదటి నుంచి వివాదాస్పదంగానే మారాయి. నామినేషన్‌ వేయ కుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్‌ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, హైకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ ఉల్లంఘించిందని  లోకసభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ విమర్శించారు.


మొత్తం మీద ప్రధాని నరెంద్ర మోదీకి స్థానిక సంస్థలనుండే మళ్ళా చుక్కలు చూపిస్తూ గుండెల్లో చలిమంటలు పుట్టిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: