నిరాహార దీక్షల ముసుగులో ఎన్నికల వ్యూహాలు స్పందించని ప్రజలు !

Seetha Sailaja
ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల అమలుచేయనందుకు కేంద్ర ప్రభుత్య వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన బంద్‌‌తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జనజీవనం స్తంభించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా ఈబంద్ లో పాల్గొనడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులలో ప్రత్యేక హోదా అంశం ఎలా నాటుకుపోయింది అర్ధం అవుతుంది. ఈరోజు జరుగుతున్న బంద్ పూర్తిగా విజయవంతం అయినా ఈప్రత్యేక  హోదా ఉద్యమ హోరు కేవలం నీటిబుడగలలా ఆశలు రేకేత్తిస్తున్నాయి. 

దీనితో గ్యమయం లేని ఈపోరాటానికి విజయం ఎప్పుడు లభిస్తుంది ఎవరికీ అర్ధంకాని ప్రశ్న గా మారింది. ఇప్పట్లో ప్రత్యేక హోదా రాదని అధికార ప్రతిపక్షాలకు తెలిసిన వాస్తవం అయినా ప్రజల మెప్పుకోసం ఓట్లు కోసం పోరాటాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2019 ఎన్నికలులో గెలవాలి అంటే ఏరాజకీయ పక్షానికి అయినా ఈ ప్రత్యేక హోదా ఆయుధం అవసరం. దీనితో అన్ని రాజకీయపక్షాలకు ప్రధాన అజెండాగా ఇదే కనబడుతున్నప్పటికీ ఎవరి సొంత అజెండాలు వారికికున్నాయి. 

ఈ ఏజెండాలో నిరాహార దీక్షలు ఒక భాగం. మొదటిగా నిరాహార దీక్షలు చేసిన క్రెడిట్‌ జగన్ వైఎస్సార్‌ పార్టీకి దక్కింది. జగన్ పార్టీ వంతు ముగిసింది కాబట్టిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు నిరాహార దీక్షకు కౌంట్ డౌన్ మొదలైంది.  చంద్రబాబు పుట్టినరోజు అయిన ఏప్రిల్‌ 20వ తేదీన ఒకరోజు నిరాహార దీక్షకు బాబు రెడీ అవుతున్నారు. ఈ దీక్ష ముగిశాక పవన్‌ కళ్యాణ్‌ దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూడాలి. 

ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తనకు స్ఫూర్తియని తాను  ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఇప్పటికే పవన్ ప్రకటించాడు. దీనితో వీరంతా ఈనిరాహారదీక్షల తరువాత ఈప్రత్యేక హోదా ఉద్యయం పై  ఏం చేస్తారు? అనే విషయం పై ప్రస్తుతానికి క్లారిటీలేదు. ఈపరిస్తుతుల  నేపధ్యంలో జగన్‌ వైకాపా ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలి వస్తున్నాయి. ఎలాగూ తన ఎమ.ఎల్.ఎ. లు అసెంబ్లీకి వెళ్లడంలేదు కాబట్టి ఈ ఎమ్.ఎల్.ఎ ల రాజీనామా అస్త్రాన్ని జగన్ చాల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్. అయితే ఇలాంటి రాజీనామాల అస్త్రం చద్రబాబు చేయలేరు. అలాచేయిస్తే ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పరినపాలన  వస్తుంది. ఇలాంటి విచిత్రమైన ఎత్తుకు పై ఎత్తు వ్యూహాల మధ్య ప్రత్యేక హోదా తెర మాటున జరుగుతున్న రాజకీయాలలో ఈనిరాహార దీక్షాల వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంత వరకు కలిసివస్తాయో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: