జగన్ రాజధానిలో అడుగుపెట్టకముందే.. ఎంత సీన్ జరిగింది..!?

Chakravarthi Kalyan
ఏపీ ప్రతిపక్షనేత జగన్ పాదయాత్ర ఎట్టకేలకు కృష్ణా జిల్లాకు చేరుకుంది. కానీ అంతకు ఒక రోజుముందే విజయవాడ రాజకీయంగా హీటెక్కింది. ఈ పాదయాత్రలోనే టీడీపీ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరడం ఆ హీట్ ను మరికాస్త పెంచేసింది. పైచేయి కోసం టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ నేతల ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటూ వచ్చిన వార్తలు రాత్రి విజయవాడలో హల్ చల్ చేశాయి. 



వన్ టౌన్ కొత్తపేట కేబీఎన్ కళశాల వద్ద వైకాపా కార్యకర్తలు కట్టిన  ఫ్లెక్సీలను పక్కకు పెట్టి స్ధానిక ఎమ్ ఎల్ ఏ జలీల్ ఖాన్  చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలు కట్టారని వైసీపీ నాయకులు ఆందోళన  నిర్వహించారు.  వైసీపీ లీడర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు రోడ్డుపైనే బైటాయించారు. దీంతో సీన్ క్రియేట్ అవుతుందని భావించిన పోలీసులు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సర్ది చెప్పిపంపేశారు. 


హమ్మయ్య సీన్ కంట్రోల్ అయ్యింది అనుకునే లోపు మరో అలజడి చెలరేగింది. ఈ సారి మహాత్మ గాంధీ రోడ్డ్ లో వైసీపీ రాష్ట్ర కార్యాలయం సమీపంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తింది. జగన్ కు స్వాగతం పలికే  ఫ్లెక్సీలను కడుతుంటే సీఎం వస్తున్నారంటూ ఫ్లెక్సీలు కట్టడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేత పార్ధసారధి పోలీసులపై నిప్పులు చెరిగారు. 



మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో మాకు తెలుసు.. మాకూ అవకాశం వస్తుంది.. అప్పుడు చూస్తాం అంటూ రెచ్చిపోయారు. ఆయనతో పాటు మాజీ ఎమ్ఎల్ ఏ యలమంచిలి రవి కూడా పోలీసులతో తీవ్రవాగ్వాదానికి దిగారు. పోలీసులు సహకరించకపోవడంతో మునిసిపల్ కమిషనర్ ఇంటి ముందు పార్దసారధి  ధర్నా చేయాలనుకున్నారు. చివరకు పోలీసుల ఎలాగోలా సర్దిచెప్పి పంపేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: