కడప: వైసీపీకి చుక్కెదురు.. ఆ మెజారిటీ వర్గం ఎటువైపంటే..?

Divya
మరో రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తేల్చే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైయస్సార్ జిల్లాలోని రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈనేపథ్యం లో అక్కడ రాజకీయ వాతావరణం తెలుసుకోవడానికి మైనార్టీకి చెందిన ఒక మిత్రుడు నిన్నటి రోజున ఫోన్ సంభాషణలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటూ అడగగా.. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా వైసీపీ పార్టీకి చాలా అనుకూలంగానే ఉందని తెలిపారట..

అలాగే ఈ సంభాషణలో షర్మిల ప్రస్తావన రాగా.. షర్మిలాను తీసి పడేయకూడదు.. ఆమెకు కాదు కాంగ్రెస్ కు ఓట్లు పడతాయేమో అన్నట్టుగా తెలియజేశారట. ముఖ్యంగా ముస్లింలకు కాంగ్రెస్ వాళ్లు ఆస్తులు రాయిస్తారని.. పదేపదే మోడీ తెలియజేయడంతో మోడీ మాటలు అక్కడ ముస్లింలను రెచ్చగొడుతున్నాయని.. అందుకే మసీదుల్లో వుండే మా వాళ్ళు అసెంబ్లీ కోసం  వైసిపికి,   ఎంపీ కోసం కాంగ్రెస్ కు  ఓటు వేయమంటున్నారు అంటూ తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే కడప పార్లమెంటులో ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడేలా కనిపిస్తున్నాయి.. కానీ వైసీపీ వాళ్లు మాత్రం ఎలాగైనా తమ పార్టీకే వేస్తారనే ధీమా తో ఉన్నారు.  కానీ వారిని పట్టించుకోలేదని అందుకే షర్మిలాకు ఓట్లు వస్తాయేమో అన్నట్లుగా ఆ జర్నలిస్టు మిత్రుడు తెలియజేశారు.

అయితే అక్కడ అవినాష్ రెడ్డి గెలుస్తాడా అనే ప్రశ్న మొదలవ్వగా గెలుస్తాడు కానీ మెజారిటీ తగ్గుతుంది అనే తెలియజేశారు.. అయితే ఈ సమాధానాలు విన్న ఆ జర్నలిస్టు మిత్రుడు కాసేపు ఆలోచించి అక్కడ తమ ముస్లిం మిత్రులకు ఫోన్ చేసి.. మసీదులో ఏదైనా చెబుతున్నారా అని అడగగా మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయమని మాత్రమే చెబుతున్నారని.. ఎంపీగా కాంగ్రెస్, ఎమ్మెల్యేగా వైసిపి అభ్యర్థికి ఓటు వేయమని ఎవరు చెప్పలేదని తెలిపారు. అయితే ఇలా ఇద్దరు ముస్లిం మిత్రులు ఆ జర్నలిస్టుకు వేరువేరు సమాధానాలు చెప్పడంతో కాసింత ఆశ్చర్యపోయాడు.
ఈ ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు మరింత తెలుసుకునేందుకు తిరుపతిలోని వైసీపీ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి ముస్లిం మైనార్టీ ఓట్ల విషయంలో ఎంపీ ఓట్ల విషయానికి వస్తే కాంగ్రెస్కు వేస్తామని చెబుతున్నారట.. దీంతో వైసిపి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం కనిపిస్తోంది. జాతీయస్థాయిలో మోడీ కాంగ్రెస్ ను టార్గెట్ చేయడంతో ఎక్కువగా మైనారిటీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు సానుభూతిగా ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: