ఏపీ: అన్నకు ఝలక్కిచ్చిన షర్మిల... కడప సాక్షిగా ఓడిస్తాను?
ఈ సందర్భంగా ఇంకా ఆమె మాట్లాడుతూ... "అన్నకి భయం లేకపోతే కడపలో ఇంతమందిని ఎందుకు ప్రచారానికి దించుతున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే వైఎస్సార్ ఆడ బిడ్డ గురించి తప్పుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అన్న జగన్ కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఈ అనైతిక చర్యలు చేపడుతున్నారు. ఒక దొంగ అయినటువంటి అవినాష్ రెడ్డికి మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే కడపలో పోటీ చేస్తున్నాను." అని ఆమె పలికారు. పెదనాన్న జార్జిరెడ్డి కొడుకులకో, లేదంటే చిన్నాన్న కొడుకులకి సీటు ఇచ్చి ఉంటే నేను ఇక్కడ పోటీ చేసేదాన్ని కాదని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ... "బాబాయ్ ని హత్య చేసిన అవినాష్ కు టికెట్ ఇవ్వడం వల్లే నేను పోటీ చేయాల్సిన తప్పనిసరి వచ్చింది. వివేకా హత్య హార్ట్ అటాక్? ఎందుకైందో అన్న చెప్పాలి. సీబీఐ దర్యాప్తు కోరిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు దాన్ని పక్కన పడేశారు? ఈ విషయం మీరు తక్షణమే కడప ప్రజలకు చెప్పాలి. అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా చూస్తూ ఉరుకుంటున్నారు. ఐదేళ్లు నిందితుడిని కాపాడటం ఒకెత్తయితే మళ్లీ ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో ఈరోజు కాకపోయినా రేపయినా చెప్పక తప్పదు!" అని ప్రశ్నించారు. ఆఖరిగా ఆమె మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో వైఎస్సార్ బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్లే అని అన్నారు.