మోత్కుపల్లి:కాంగ్రెస్ కు అంత సీన్ లేదు..14 గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.!

Pandrala Sravanthi
ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు గల్లి నుంచి మొదలు  పెద్ద పట్టణాల వరకు చాలా బిజీగా ఉంటారు. అంతకుముందు ప్రజలకు కనిపించని నాయకులంతా   ప్రత్యక్షమవుతుంటారు. ప్రజలతో మమేకమవుతూ  మూడు సభలు 6 స్పీచ్ లు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో  పార్లమెంట్ ఎలక్షన్స్  హవా నడుస్తోంది.  ఇదే తరుణంలో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి 14 పైగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించినటువంటి  మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు  సంచలన కామెంట్స్ చేశారు. 

పార్లమెంటు టికెట్ల విషయంలో  కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని  అన్నారు. మాదిగలు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా..  35 లక్షల మాదిగలు ఉండగా పార్లమెంటు ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. ఈసారి తప్పక రేవంత్ రెడ్డిపై మాదిగలంతా తిరుగుబాటు చేయాలని  అన్నారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఎంపీ సీట్ల కేటాయింపులో రెడ్డిలకు, మాలలకే పెద్దపీట వేశారని, మాదిగ జాతిని విస్మరించారని ఆయన తెలియజేశారు.

 అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ  ఈ సీట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఎమ్మార్పీఎస్ అధినేత  మందకృష్ణ మాదిగ అన్నారు. మే 4వ తేదీన ఇందిరా పార్క్ లేదా అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగలంతా కలిసి సామూహిక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, మే 5వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఆత్మగౌరవ పరిరక్షణ యాత్రలు చేస్తామని తెలియజేశారు. కాబట్టి మాదిగలంతా ఏకమై మన హక్కులను కాపాడుకొని మన ఓటు దెబ్బతో కాంగ్రెస్  కు దిమ్మతిరిగేలా చేద్దామని పిలుపు నిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే నేను పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: