ఎన్నిక‌ల వేళ టీడీపీ బ్లండ‌ర్ మిస్టేక్‌.. చేజేతులా ఆ సీట్లు పోగొట్టుకుంటోందా ?

RAMAKRISHNA S.S.
ఎన్నిక‌ల వేళ‌.. ఏ పార్టీకైనా.. ప్ర‌తి క్ష‌ణం కీల‌కం. ప్ర‌తి ఒక్క‌రూ కీల‌కం. అదేంటోకానీ.. టీడీపీ మాత్రం త‌ప్పు ల‌పై తప్పులు చేస్తోంది. ఇప్ప‌టికే సున్నిత‌మైన వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను అడ్డ‌దిడ్డంగా కెలికేసి.. నానా తిప్ప లు ప‌డుతోంది. ఈ విష‌యంలో జీతాలు పెంచుతామ‌ని.. రూ.ల‌క్ష సంపాయించుకునే మార్గాలు చూపిస్తా మ‌ని చెబుతున్నా... వ‌లంటీర్లు న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి స‌మ‌యంలోనే పింఛ‌న్ల వ్య‌వ‌హారాన్ని కెలికేసి.. మ‌రిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంది.

దీంతో 66 ల‌క్ష‌ల మంది పింఛ‌ను దారుల ఓట్ల‌పై టీడీపీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఒక‌వైపు.. ఇవి ఇబ్బం దులు పెడుతున్న స‌మ‌యంలోనే.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న నిర్ణ యం తీసుకున్నారు. ప‌లు జిల్లాల్లో పార్టీకి అండ‌గా ఉన్న‌.. ప్ర‌స్తుతం అసంతృప్తితో ర‌గిలిపోతున్న నాయ‌కుల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. వారిలో ఉండి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాణంగా ఉన్న క‌లువ పూడి శివ‌(వెంక‌ట శివ‌రామ‌రాజు), విజ‌యన‌గ‌రం జిల్లాలోని మీసాల గీత వంటివారు ఉన్నారు.

అదేవిధంగా అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, అమలాపురానికి చెందిన పరమట శ్యాం కుమార్‌, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు,  సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. వీరంతా కూడా .. టికెట్లు ఆశించిన వారు. అయితే.. కూట‌మి నేప‌థ్యంలో వారికి టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో వీరు స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా రంగంలో ఉన్నారు. దీంతో వీరిపై వేటు వేశారు.

అయితే.. ఇలా చేయ‌డం ద్వారా.. టీడీపీకే న‌ష్ట‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక్కొక్కరితో నూ.. చంద్ర‌బాబు లేదా నారా లోకేష్‌లు ఒక్కొక్క నిముషం మాట్లాడినా.. ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంది. వారు నామినేష‌న్లు వేసినా.. పోటీలో లేకుండా త‌ప్పించుకునే అవ‌కాశం ఉంది. నామినేష‌న్ వేసినంత మాత్రాన‌.. వారు పోటీలో ఉన్న‌ట్టు కాదు.. ఈ నేప‌థ్యంలో వారిని బుజ్జ‌గించేందుకు మ‌రో 10 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ఉంది. అయినా.. వారిని స‌స్పెండ్ చేశారు. దీంతోవారు మ‌రింత రెచ్చిపోయినా ఆశ్చ‌ర్యం లేదు.

తాము గెల‌వ‌క‌పోయినా.. ఫ‌ర్లేదు.. పార్టీ ఓడితే చాల‌నుకుని ప‌నిచేస్తే.. ఆ న‌ష్టం ఎవ‌రిదో ఊహించ‌డం పెద్ద క‌ష్టం కాదు.ఎలా చూసుకున్నా.. త‌ప్పుల‌పై త‌ప్పులు చేయ‌డంలో టీడీపీ రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితి వైసీపీలో లేదు. ఎవ‌రూ ఒక్క‌రు కూడా.. రెబ‌ల్‌గా పోటీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ పార్టీకి, టీడీపీ కి ఉన్న తేడా ఏంటో గుర్తిస్తే మంచిద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: