హిజ్రాలను ఇలా చూస్తే.. షాక్ అవకుండా ఉంటారా..! ?

Chakravarthi Kalyan

సమాజంలో హిజ్రాలను చూడగానే చాలా మంది భయపడిపోతారు.. వారికి దూరంగా జరగాలని ప్రయత్నిస్తారు. అందుకు ప్రత్యేకంగా కారణాలేమీ అక్కర్లేదు.. వారు హిజ్రాలు కావడమే అందుకు కారణం. అలా సమాజంలో హిజ్రాలపై ఓ ముద్ర ఉంది. అందుకే సమాజంలో హిజ్రాలు వివక్షకు గురవుతున్నారు.


ఈ వివక్ష తొలగించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఓ కొత్త ప్రయత్నం చేపట్టింది. హిజ్రాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది. ఇకపై జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంకుల్లో హిజ్రాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందట. ఇందుకోసం అయిదు పెట్రోల్‌ బంకులను ఎంపిక చేసింది. వారికి ఆయా బంకుల్లో వారిని నియమిస్తుంది.


ఏదో ఒకటి, రెండు కాదండోయి.. మరో రెండేళ్లలో రాష్ట్రంలో వంద పెట్రోల్‌ బంకుల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని జైళ్ల శాఖ ముందుకు సాగుతుంది. అడుగడుగునా వివక్షకు గురవుతున్న హిజ్రాలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నడుం బిగించింది. సరైన ఉపాధి లేకపోవడంతో కొందరు హిజ్రాలు యాచకులుగా మారుతున్నారు.


మరికొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. సరైన ఉపాధి కల్పిస్తే మారేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు. కానీ సమాజం వారిని అలాగే చూస్తోంది. అందుకే తెలంగాణ జైళ్ల శాఖ హిజ్రాల ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెలలోనే 6 పెట్రోల్‌ బంకులు ప్రారంభించనున్నారు. దేవరకొండ, మిర్యాలగూడ, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఈ పెట్రోల్‌ బంకులు అందుబాటులోకి రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: