అందుకే ఇంటర్ ఫేయిల్ అయ్యా..! : సీఎం చంద్రబాబు

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానానికి నిన్నిటితో నలభై ఏళ్లు నిండాయి.  మామూలు రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వచ్చారు.  చిన్న నాటి నుంచే రాజకీయాలపై అవగాహన పెంచుకుంటూ..యుక్త వయసులో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. తన రాజకీయ జీవింతపై ఓ టీవి ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ..ఎన్నో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తన తనకు పదహారేళ్ల వయసున్నప్పుడు అన్ని విషయాలు చాలా తేలిగ్గా తీసుకునేవాడినని...ప్రతి విషయంలో తొందరపాటు తో ఉండేవాడినని అందుకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫేయిల్ అయ్యానని చెప్పారు. అప్పటి నుంచి తానను తాను ప్రశ్నించుకొని ఆవేశం తగ్గించుకొని చదువుపై శ్రద్ద పెట్టడం మొదలు పెట్టానని అన్నారు. 

ఆ తర్వాత తిరుపతి వెళ్లి చదువుకున్న తనకు అన్నీ విజయాలేనని చెప్పారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు తానెప్పుడూ సిగిరెట్ తాగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో అవతలి బ్యాచ్ తో గొడవ జరిగిన సందర్భాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.  అప్పట్లో స్టూడెంట్ యూనియన్ల గొడవలు, గ్రూపు తగాదాలు చాలా ఉండేవని..అయితే అవతలి బ్యాచ్ వారిని చూసి, తమ బ్యాచ్ భయపడి పారిపోయేదని అప్పుడు తమ బ్యాచ్ కి లీడర్ గా అన్ని విషయాల్లో ధైర్యంగా ముందు ఉండేవానినని..ఆ దెబ్బతో అవతలి బ్యాచ్ మమ్ముల్ని చూసి పారిపోయిందని అన్నారు. 

ఈ సంఘటనతో తనపై కేసులు పెట్టారని, ఆ తర్వాత కొట్టేశారని, ‘హింస’ అనే పదానికి తన జీవితంలో చోటులేదని చెప్పుకొచ్చారు. స్టూడెంట్ గా ఉడుకు రక్తంతో దూకుడుగా ప్రవర్తిస్తారని..అయితే స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేసిన రాజకీయాలు.. మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేస్తే ఫ్యాక్షనిస్టులగా మారుతారని..అయితే గౌరవమైన పదవిలోకి వచ్చిన తర్వాత మన స్వభావం పూర్తిగా మార్చుకోవాలని..ప్రత్యర్థులకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా రాజకీయ పాలన చేయాలని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: