ఈవీఎంలు వ‌ద్దు బ్యాలెట్లే ముద్దు.. క్లారిటీ ఇచ్చేసిన జ‌గ‌న్..!

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 151 సీట్ల నుంచి ఎవరూ ఊహించని విధంగా 11 సీట్లకు పడిపోయింది. చరిత్రలో ఏ సీఎం/పార్టీకి, ఎన్నడూ కూడా ఇలా జరగలేదు. అందుకే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మాజీ సీఎం జగన్ కూడా తమకు ఇంత తక్కువ సీట్లు రావడం ఆశ్చర్యకరంగా ఉందని మాట్లాడారు. ఏం చేశారో తెలియదు, ఆధారాలు లేవు కానీ ఏదో చేశారు అని అన్నారు. ఆయన సీఎంగా రాజీనామా చేశాక టీడీపీ వాళ్లు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారేమో అన్నట్లు అర్థం వచ్చేలాగా కామెంట్లు చేశారు.
జగన్ ఒక్కరే కాదు చాలామంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఘన విజయాలు సాధించింది. జనసేన 100% సక్సెస్ రేట్ సాధించింది. ఆ కారణంగా ఇది ఎలా సాధ్యం అనే కోణంలో కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇందులో ఏమైనా అవకతవకలు జరుగుతాయి ఏమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో జగన్ మరోసారి మోసం జరిగిందేమో అన్నట్లు ఒక ట్వీట్ చేశారు.

"న్యాయం జరగడం మాత్రమే కాకుండా జరిగిందని అందరికీ తెలిసేట్లు చూపించాలి. అలానే ప్రజాస్వామ్యం కేవలం ఉనికిలో ఉండటమే కాకుండా స్పష్టంగా ఉన్నట్లు కూడా కనిపించాలి. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో, EVMsకి బదులుగా పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి మనం కూడా పేపర్ బ్యాలెట్లను పాటించాలి." అని మాజీ సీఎం జగన్ ఒక ట్వీట్ చేశారు."మోసం చేసి గెలిచారు అన్న... ప్రజల అందరి నోటా ఇదే మాట.... ఈవీఎం లను హ్యాకింగ్ చేసి గెలిచిన ఈవీఎం సీఎం చంద్రబాబు" అని దీని కింద వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ షాకింగ్ కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: