కేసీఆర్‌: పడుకున్నోడిని లేపుతున్న మోడీ..రేవంత్‌ కే బొక్కా ?

Veldandi Saikiran
అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన గులాబీ పార్టీ... ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎక్కడ కూడా గులాబీ పార్టీ నేతలు... హడావిడి కూడా చేయడం లేదు. అటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో... రిలాక్స్ అవుతున్నారు. కేటీఆర్ అలాగే హరీష్ రావులు తమ నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. ఇలాంటి నేపథ్యంలో... గులాబీ పార్టీకి కొత్త ఆయుధం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు నరేంద్ర మోడీ.

పడుకున్నోళ్ళను.. రేపు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని... మళ్లీ తెలంగాణకు తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అలాగే స్పీకర్ గా పనిచేసిన అనుభవం  కిరణ్ కుమార్ కి ఉన్న నేపథ్యంలో... అతన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందట.

గత రెండు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే... ఈ వార్త బయటకు రావడంతోనే.. కెసిఆర్ పార్టీ అలర్ట్ అయింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్గా చేస్తే ఊరుకునేది లేదంటూ... సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది గులాబీ పార్టీ.  తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా... ఇవ్వనంటూ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ... తెలంగాణ ప్రజలను అలర్ట్ చేస్తోంది గులాబీ పార్టీ.
 

జాతీయ పార్టీలకు అధికారం ఇస్తే... తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని... మళ్లీ సమైక్య పాలకులు తెలంగాణపై పెత్తనం  చేస్తారు అంటూ... ప్రస్తుత పరిస్థితులను హైలెట్ చేస్తుంది గులాబీ పార్టీ. ప్రస్తుతం డీలపడిన గులాబీ పార్టీకి....  కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో కొత్త ఆయుధం దొరికింది. త్వరలోనే దీనిపై గ్రౌండ్ స్థాయిలో ఉద్యమం కూడా చేసేందుకు సిద్ధమవుతోంది కేసీఆర్ పార్టీ. ఒకవేళ.. ఈ అంశాన్ని బలంగా కేసీఆర్ పార్టీ తీసుకువెళ్తే... కాంగ్రెస్కు అలాగే బిజెపి పార్టీకి తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: