టీనేజ్.. కాలేజ్.. యమ డేంజర్ అన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇప్పటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి.. ఇంటర్ నెట్ సింపుల్ గా అందుబాటులో ఉంది. అసలే వయస్సు జోరు విచక్షణను పట్టించుకోని ఏజ్ అది. వయస్సు కోరికలు.. స్నేహితులతో షికార్లు.. ఆడామగా కలిసి చదువుకునే వాతావరణం.. ఈ పరిస్థితుల్లో అమ్మాయిలైనా సరే విచక్షణ కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ.
మరి ఇలాంటి పరిస్థితుల్లో టీనేజ్, కాలేజ్ కుర్రకారు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువు తప్పుదారి పట్టకుండా వయసు వ్యామోహాలకు గురికాకుండా ఓ
కన్నేసి ఉంచాలి. మరి హాస్టల్లో ఉండి చదువుకునే వారి పరిస్థితి ఏంటి.. అందులోనూ ఇంటికి దూరంగా ఉండే అమ్మాయిల పరిస్థితి ఏంటి.. చెడు తిరుగుళ్లు తిరగకపోయినా స్మార్ట్ ఫోన్ల కారణంగా పోర్న్ చూసేందుకు అలవాటు పడితే వారిని ఎలా గాడిలో పెట్టాలి.
ఇది నిజంగా తల్లిదండ్రులకు సున్నితమైన సమస్యే. ఐతే.. దీనికీ పరిష్కారం ఉంది. ముందు తరచూ బూతు వీడియోలు, పోర్న్ చూసేందుకు తమ పిల్లలు అలవాడు పడ్డారని నిర్థారణ చేసుకున్న తర్వాత వారితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వారితో కోప్పడకుండా చాలా సంయమనంతో వ్యవహారించాలి. సందర్భాన్ని కల్పించుకుని వారితో అనునయంగా మాట్లాడాలి. టీనేజీలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే మార్పులూ, సెక్స్ విషయాలపై కలిగే తీవ్రమైన ఆసక్తి గురించి వివరించాలి.
పోర్న్ చూడటం, బూతు వీడియోల ద్వారా ఎలాంటి అనర్దాలు ఏర్పడతాయో.. తొందరపడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వివరించాలి. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలతో చెప్పే పరిస్థితి లేకపోతే.. పిల్లలు ఎవరు చెబితే వింటారో వారితో చెప్పించాలి. లేదా కౌన్సెలింగ్ సాయం తీసుకోవాలి. పిల్లల స్నేహితులు ఎటువంటి వారో కనుక్కోవాలి. వయసుతో పాటు వచ్చే హార్మోన్ల హెచ్చుతగ్గులూ, స్నేహితుల ప్రభావం గురించి వివరించాలి. మంచి స్నేహితులను ఎంచుకునే అవకాశం కల్పించాలి. అవసరమైతే మానసిక నిపుణుల సాయం తీసుకోవాలి.