సమంత కుల్లుకుని కుల్లుకుని ఏడ్చే వార్త.. వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!?

Thota Jaya Madhuri
టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అక్కినేని నాగ చైతన్య… తొలి సినిమా ‘జోష్’తో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత తనదైన నటన, కథల ఎంపికతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘ఏం మాయ చేశావే’, ‘100% లవ్’, ‘మజిలీ’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలతో యువతకు దగ్గరయ్యారు. క్రమంగా టాలీవుడ్‌లో స్థిరమైన హీరోగా తనకంటూ ప్రత్యేక మార్క్‌ను ఏర్పరచుకున్నారు.ఇప్పుడు నాగ చైతన్య జీవితం మరో కీలక మలుపు వద్దకు చేరుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగ చైతన్య తండ్రి కాబోతున్నారని, ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ గర్భం దాల్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అక్కినేని అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే ఇప్పటివరకు నాగ చైతన్య కానీ, శోభితా ధూళిపాళ కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇది ప్రస్తుతానికి కేవలం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం మాత్రమే. ఇటీవలే నాగ చైతన్య – శోభితా దంపతులు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.



ఇంతలోనే నాగ చైతన్య తండ్రి కాబోతున్నారనే వార్త బయటకు రావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అక్కినేని కుటుంబంలో మరో వారసుడు రాబోతున్నాడనే ఊహే ఫ్యాన్స్‌కు పండుగలా మారింది. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. అయితే, ఈ వార్తల నేపథ్యంలో ఒక దురదృష్టకర అంశం కూడా చోటు చేసుకుంటోంది.కొంతమంది నెటిజన్లు కావాలనే ఈ వార్తను ఆధారంగా చేసుకుని సమంతను ట్రోల్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇది అందరికీ గుడ్ న్యూస్ కావచ్చు కానీ సమంతకు బ్యాడ్ న్యూస్ అంటూ, కుల్లుకుని ఏడుస్తుందంటూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రకమైన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా మారుతున్నాయి. ఒకరి వ్యక్తిగత జీవితంలో జరిగే మార్పులను మరొకరిని కించపరిచేలా ఉపయోగించడం ఎంతవరకు సరికాదన్న చర్చ కూడా జరుగుతోంది.



మొత్తానికి, అక్కినేని నాగ చైతన్య తండ్రి కాబోతున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై స్పష్టత లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో జీవితంలో మరో మధుర ఘట్టం మొదలవుతుందని ఆశిస్తూ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: