సినిమాలకు గుడ్ బై..! జనసేన కోసం పవన్ యాక్షన్ ప్లాన్ ఇదే..!!

Vasishta

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేతగా తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక సినిమాలు చేయబోనని వెల్లడించారు. పూర్తిస్థాయిలో రాజకీయాలకే సమయం కేటాయించనున్నట్టు పవన్ తెలిపారు.


సినిమా హీరోగా పవన్ కల్యాణ్ కు ఉన్న పేరు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయన అర్ధాంతరంగా సినిమాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగబోతోందని చెప్పిన పవన్ కల్యాణ్.. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. వాస్తవానికి గతేడాది అక్టోబర్ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తానన్నారు. అయితే అజ్ఞాతవాసి ఆలస్యం కావడంతో లేటైంది.


ఇప్పుడు పవన్ కల్యాణ్ ధ్యాసంతే జనసేన మాత్రమేనని ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. సరిగ్గా ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం. నాయకత్వాన్ని పెంపొందించడం.. సరైన అభ్యర్థులను బరిలోకి దించడం.. లాంటి పనులపైనే ఆయన దృష్టి కేంద్రీకరించబోతున్నారు. కొండగట్టు నుంచి అప్రతిహతంగా తన యాత్ర కొనసాగుతుందని ఇప్పటికే పవన్ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే యాత్ర ప్రారంభించేశారు.


పవన్ కల్యాణ్ యాత్ర అనగానే చాలా మంది జగన్ లాగా పాదయాత్ర చేస్తారని అందరూ భావించారు. అయితే పవన్ దృష్టిలో యాత్ర అంటే అదికాదు. సినిమాలను పక్కనపెట్టి పూర్తిస్థాయిలో జనసేన కార్యకలాపాలకు సమయం కేటాయించడం.. జనాల్లోకి విస్తృతంగా వెళ్లి సమస్యలపై అధ్యయనం చేయడం లాంటివి.! ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం చిన్నస్థాయి మీటింగులు మాత్రమే. బహిరంగసభలుండవు.. పాదయాత్రలుండవు.. బస్సుయాత్రలుండవు..! ఇప్పుడు ఎలాగైతే చిన్నచిన్న మీటింగులు పెట్టి ప్రసంగిస్తున్నారో.. ఇక ముందు కూడా అలాంటి సభలే ఉండబోతున్నాయి. అయితే ఇకపై నెలలో సగం రోజులు జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నరు పవన్ కల్యాణ్.


తెలంగాణ పర్యటన ముగిసిన వెంటనే జగన్ అనంతపురం టూర్ వెళ్తున్నారు. ఆ తర్వాత విశాఖ టూర్ ఉంటుంది. అనంతపురం నుంచే పవన్ పోటీ చేయబోతున్నారు. అంతేకాక.. పార్టీ ఆఫీసు కూడా ఓపెనింగ్ ఉండనుంది. దీంతో.. అక్కడ ఎక్కువ రోజులు గడుపుతారనే సమాచారం ఉంది. ఆ తర్వాత వచ్చే నెల నుంచి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు ఉండేలా పవన్ టీం షెడ్యూల్ ఖరారు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: