ఎన్నికల తర్వాత ఎన్డీయేలోకి బీఆర్ఎస్..?

గుణాత్మక మార్పు అనే నినాదం గతంలో వినిపించిన గులాబీ బాస్.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషిస్తామని చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం అనే కొత్తరాగం అందుకున్నారు. భారత రాష్ట్ర సమితి పనైపోయిందని, ఒక్క సీటు కూడా రాదని ప్రత్యర్థులు లైట్ తీసుకుంటున్న వేళ తనో కొత్త లెక్క చెబుతున్నారు.

ఎన్డీయే కూటమి ఈ సారి 200 సీట్ల వరకే సాధించగలుగుతుంది అని జోస్యం చెప్పారు. పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే ఈ లోక్ సభ ఎన్నికలు చాలా కీలకం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు కేసీఆర్.  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి థర్డ్ ఫ్రంట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు.

కానీ అవేమీ వర్కౌట్ కాకపోవడంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి.. మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు తెరిచి.. సభలు నిర్వహించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎదురవడంతో తిరిగి మళ్లీ టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు.  ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికల్లో పార్టీని బరిలో ఉంచేందుకు వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. తమకు 12 ఎంపీ సీట్లు ఇస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని పిలుపునిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అయితే బీజేపీ ఆధ్వర్యంలో…లేదంటే కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణం ఏర్పడాలి. ఈ రెండు పార్టీలు లేకండా కేంద్ర ప్రభుత్వం ఏర్పడటం అసాధ్యం. ఈ విషయం అర్థమయ్యే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ లు సైలెంట్ గా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రధాన శత్రువు కాంగ్రెస్.  నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవిలో ఉంటారు అని కేసీఆర్ అన్నారు. అంటే.. ఎన్నికల తర్వాత బీజేపీ కూటమిలోకి చేరతాను అనే సంకేతాలను గులాబీ బాస్ పంపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: