రతనాల సీమ రాళ్ల సీమైందా.. సీమ నేతలే సీఎంలు అయినా వలసలను ఆపలేరా?

Reddy P Rajasekhar
రాయలసీమ అంటే రతనాల సీమ అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి సంవత్సరం సీమ జిల్లాలలో సరైన ఉపాధి పనులు లేక వేల సంఖ్యలో కూలీలు దూర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. పొట్టకూటి కోసం సీమ జిల్లాలలో వలసలు సాధారణమే అని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.
 
వందలాది రైతు కూలీలు సంగారెడ్డి, రంగారెడ్డి, గుంటూరుకు వెళ్తూ అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్నారు. మరి కొందరు రైతు కూలీలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్తూ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలలో పని చేస్తున్నారు. వర్షాకాలంలో నాలుగు నెలలు మాత్రమే ఉపాధి లభిస్తుందని మిగిలిన ఎనిమిది నెలలు సొంతూరికి దూరంగానే వీళ్లు కాలం వెళ్లదీస్తున్నారని సమాచారం అందుతోంది.
 
సీమ నేతలే సీఎంలు అయినా ఈ పరిస్థితులు మాత్రం మారడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీమవాసులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేసినా చివరకు మిగిలింది మాత్రం శూన్యమేనని చెప్పవచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోలలో ఎన్నో హామీలను ప్రకటిస్తున్నా రాయలసీమకు ఏం చేశారనే ప్రశ్నలకు మాత్రం వాళ్ల దగ్గర సమాధానం లేదు.
 
సీజనల్ వలస కూలీలకు ఉపాధి కల్పిస్తే ఈ పరిస్థితులు మారే అవకాశాలు అయితే ఉంటాయి. కరువు సీమ కన్నీళ్ల సీమగా మారుతోందని వలసల వల్ల పిల్లలు చదువు విషయంలో సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్, చంద్రబాబు సీమ ప్రజల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే మంచిది. రాయలసీమలోని మెజారిటీ స్థానాలలో వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తున్నాయి. చంద్రబాబుతో పోల్చి చూస్తే జగన్ తమకు మంచి చేస్తాడని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. సీమవాసుల నమ్మకాన్ని నిలబెట్టుకుని సీమప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగేలా జగన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రతనాల సీమ రాళ్ల సీమ అవుతోందని కొంతమంది బాధతో చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: