స్పెషల్: సంక్రాంతి ప్రత్యేకత

సంక్రాంతి అనే పదం "సంక్రమణము" అనే మూలం నుండి పుట్టింది. సంక్రమణం అంటే అర్ధం మార్పు చెందు లేదా మారు ట అని అర్థం. సూర్య భగవానుడు మేషం మొదలైన పన్నెండు రాశులందు క్రమంగా ఒక్కో రాసినుండి నుండి మరో రాసికోకి ప్రవేసించటాన్ని సంక్రమణం చెందటం లేదా సంక్రాంతి అంటారు.  ఇలా సంవత్సరం లో పన్నెండు సార్లు ఆదిత్యుడు ఒక రాశి నుండి మరో రాశి కి మారటం లేదా సంచరించటంతో సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి.

అయితే, పుష్య మాసంలో, హేమంత ఋతువులో, శీతల పవనాలు వీస్తూ, మంచు కురిసేకాలంలో సూర్యుడు "మకరరాశి" లోకి సంచరించే వేళ వచ్చేదే "మకర సంక్రాంతి" దానికి పౌరాణికంగా, సాంఘికంగా, ఆచారవ్యవహారాల పరంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది ఇంగ్లీష్ కాలెండర్ ప్రకారం జనవరి నెలలో 15వ రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు అంటే మకర సంక్రాంతి రోజు నుండి "స్వర్గ లోక ద్వారాలు" తెరచి ఉంటాయని పురాణాలు చెపుతున్నాయి. 


తెలుగు వారందరికి ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతములో నివసించే వారికి  "మకర సంక్రాంతి" అత్యంత పెద్ద పండుగ కొన్ని ప్రాంతాలలో ఈపండుగను మూడురోజులు "భోగి, సంక్రాంతి, కనుమ" మరికొన్ని ప్రాంతాలలో నాలుగురోజులు భోగి, సంక్రాంతి  కనుమ ముక్కనుమ" పేర్లతో జరుపుకుంటారు. ఈ పండుగ పంటలు పండి ఆ ఫలాలు వారి చేతి కొచ్చిన ఆనందాతిశయాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా రైతులు సకుటుంబ, సపరివార సమేతంగా ఈ పండుగ జరుపుకుంటారు. అందుకే గ్రామీణ భారత ప్రాంతాల్లో జరుపుకునే దీన్ని "రైతుల పండుగ" గా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో సంవత్సరంలోని ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. 


నిజానికి "ధనుర్మాసారంభం" తో నెల రోజులు మూమూలు గానే "సంక్రాంతి" వాతావరణం శీతలపవనాలతో చలిచలిగా తెలుగు బాషాప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఆ నెలరోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారు తాయి. ఈ కాలంలోనే రైతుల వద్ద సంపద ఒన గూడుతుంది కాబట్టి వినోదాలను పంచే బుడబుక్కలవాళ్లు, గంగిరెద్దులవాళ్లు, హరిదాసు లు, పగటి వేషధారులు తదితర జానపద వినోద కళాకారులు వస్తారు. 


ఈ పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను, వాకిళ్ళను, లోగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. రంగురంగుల రంగవల్లులను రంగులతో బియ్యపు పిండి తెల్లని ముగ్గులు వేయటానికి ప్రత్యేకం గా వాడతారు. ఈ కాలం లోనే పొలం లోని దాన్యం నూర్చే ప్రాంతాలనుండి అంటే "కళ్ళేం" నుంచి ఎడ్లబళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూఉంటాయి. 


భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ఈ పండుగకే కొత్త అల్లుడు తప్పని సరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ళ  పరి హాసాలతో బావమరుదల అల్లరులతో  చలోక్తులతో  ఈ అల్లుడు వినోదించటం ఆనవాయితీ. అందరూ కోడి పందాలు, ఎడ్లబళ్ళ పందాలతో ఎంతో వినోదిస్తారు. పండుగ సందడికి ఇవన్నీ శోభను చేకూర్చే విషయాలు.


మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథునరాశులలో సూర్యభగవానుడు సంచరించే కాలం ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణం. 


కర్కాటకరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి మొదలై సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సురాశులలో సంచరించే కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చన కు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అను వైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. 


పన్నెండు నెలల కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కనుకనే దక్షిణాయణములో అంత్యకాలం సమీపించి నా ఇచ్చామరణ వరం కలిగి ఉన్న మహానుభావుడు భీష్మ పితామహులు, ఉత్తరాయణం వరకూ బాణాలతో అర్జునుడు నిర్మించి న అంపశయ్యపై పరుండి ఉత్తరాయణము కొరకు ఎదురుచూసి అది ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు 


"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే మార్పు చెందుట లేదా చేరుట అని అర్ధం. జయసింహ కల్ప ద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని  ఇలా విర్వచించారు - 


"తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః" అర్ధమేమంటే మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి (పూర్వ రాశి) నుండి తరువాతి రాశి (ఉత్తర రాశి) లోనికి ప్రవేశించడమే సంక్రాంతి - సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ" గా వ్యవహరిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: