జల్లికట్టుపై కేంద్ర నిర్ణయంతో తమిళులు ఫుల్ ఖుషీ..!

siri Madhukar
తమిళనాడులో సంప్రదాయ క్రీడగా కొనసాగుతున్న జల్లికట్టు ఆపివేయాలని ఆ మద్య ఎన్నో గొడవలు అయ్యాయి.  అయితే తమిళనాడులో అనాధిగా వస్తున్న సాంప్రదాయక క్రీడను ఉన్న ఫలంగా ఆపితే ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటాయి..ప్రజలతో పాటు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకులు కూడా వ్యతిరేకించారు.  తాజాగా  జల్లికట్టు ఆటపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

జల్లికట్టుపై నిషేధానికి నిరసనగా గతేడాది రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. 1960 జంతుహింస చట్టాన్ని సవరించింది. వాస్తవానికి గతేడాది నిర్వహించాల్సిన జల్లికట్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో కేంద్రం దిగివచ్చింది.

1960 జంతు హింస చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది.అయితే సంక్రాంతికి ముందే వచ్చే నెల 7న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం నిర్ణయంతో జల్లికట్టు నిర్వాహకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రం తీరుపై జంతు పరిరక్షణ సంఘం పెటా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: