36 ఏళ్ల వయసులో కూడా తగ్గేదెలే అంటున్న యాంకర్ రష్మి..!

Anilkumar
బుల్లితెర టాప్ యాంకర్ లిస్ట్ లో రష్మీ ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసుకుని అందంతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది రష్మి. తన అద్భుతమైన అందంతోపాటు గలగల మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. షోస్ చేస్తూ కేవలం డబ్బులే కాకుండా ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. అయితే గత 12 సంవత్సరాలుగా తెలుగు

 బుల్లితెరను ఏకధాటిగా ఏలేస్తోంది రష్మీ. ఒడిశాకు చెందిన ఈమె విశాఖపట్నంలో పొట్టి పెరిగింది. ఆ తర్వాత సినిమాల్లో నటించాలి అన్న ఆశతో హైదరాబాద్ కి వచ్చింది. అలా 2002లో సవ్వడి అనే సినిమాతో తన కెరీర్ నీ ప్రారంభించింది. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించింది. అలా ఈ పాత్ర ద్వారా తనకి మంచి గుర్తింపు వచ్చింది దాని తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ముందుకు వెళ్ళింది. కానీ హీరోయిన్గా చేయాలి అన్న

 ఆసక్తి మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే ఇప్పటికీ పలు సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తుంది. ఒకవైపు కెరియర్ లో ఫుల్ బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన పర్సనల్ విషయాలను అలాగే మూగజీవాలకి సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు విచిత్రమైన ఔట్ఫిట్స్ వేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. వైట్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అందాలను వలకబోస్తోంది. ముఖ్యంగా చాంద్ బాలి ఇయర్ రింగ్స్ పెట్టుకొని అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. అద్భుతమైన స్టిల్స్ తో ప్రస్తుతం రష్మికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసి అదిరిపోయావ్ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: