కంగారు పడకండి.. దేవర విషయంలో క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒకవైపు దేవర.. మరొకవైపు వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒకే సమయంలో రెండు సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు.. రెండు సినిమాలు ఒకేసారి వస్తాయా.. లేదా ఏదైనా సినిమాను పక్కన పెట్టేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు దేవర షూటింగ్ జరుగుతుందా.. దేవర అయిపోయాక వార్ 2 పరిస్థితి ఏంటి.. అసలు ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ప్లానింగ్ ఫాలో అవుతున్నాడు.. అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా

 పెద్ద ఎత్తున దిగులు పడుతున్నారు. ఇక ఇదే విషయం గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం... జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అలాగే వార్ టు సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే కచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాల విషయంలో పోటీ తప్పదు అని ముందు నుండే అనుకున్నారట. అందుకే ఈ రెండు సినిమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే డేట్స్ విషయంలో బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే మొన్నటి వరకు వార్ 2

 సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగింది. దాని తర్వాత ఆ సినిమాకి కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత దేవర షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే దేవర సినిమా మొత్తం పూర్తి అయ్యి విడుదల అయ్యేంతవరకు వార్ 2 సినిమాకి కాస్త దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దేవర సినిమా పూర్తి కావడానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వార్ టు తో బిజీ కానున్నాడు. ఇక వార్ టు లో స్పై పాత్రలో కనిపించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే దీనికి సంబంధించిన 40% షూటింగ్ సైతం పూర్తయినట్లుగా తెలుస్తోంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: