మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు బుక్ మై షో లో భజే వాయు వేగం సూపర్ గ్రోత్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ కొంత కాలం క్రితం బెదురులంక 2012 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో కార్తికేయ కు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. దానితో ఈ సినిమా చాలా సింపుల్ గా తక్కువ థియేటర్లలో విడుదల అయింది. ఇక విడుదల తర్వాత ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ మూవీ కలెక్షన్లు మొదటి రోజుతో ప్రేమిస్తే రెండవ రోజు భారీగా పెరిగాయి. ఇక బుక్ మై షో లో కూడా ఈ సినిమాకు ఒకటవ రోజుతో పోలిస్తే రెండవ రోజు భారీ గ్రోత్ కనిపించింది.

ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో మొదటి రోజు 5.77 కే మాత్రమే అమ్ముడుపోగా , ఈ సినిమాకి మొదటి రోజు సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు సంబంధించిన రెండవ రోజు టికెట్లు బుక్ మై షో లో 20.22 కే టికెట్లు అమ్ముడు పోయాయి. అలా ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు భారీగా అమ్ముడుపోయాయి. ఇక ఆఫ్ లైన్ లో కూడా ఈ సినిమాకు మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లలో చాలా గ్రోత్ కనిపించింది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే భజే వాయు వేగం సినిమా మరో రెండు , మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: