పాదయాత్రలో జగన్..! అసెంబ్లీ లీడర్ గా రోజాకు ఛాన్స్..?

Vasishta

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్నాయి. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేరు. ఈ నేపథ్యంలో జగన్ స్థానాన్ని భర్తీ చేసేదెవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


          ఇప్పటివరకూ వైసీపీ తరపున జగన్ తర్వాత అత్యధికంగా పాపులర్ అయిన లీడర్ రోజా మాత్రమే.! పార్టీలో జగన్ తర్వాత ప్లేస్ ఎవరిది అని అడిగితే చాలా మంది రోజా పేరే చెప్తారు. పార్టీలో ఆమె ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. ఎలాంటి అంశంపైనైనా ప్రభుత్వాన్ని, టీడీపీ నేతలను ఇరుకున పెట్టడంలో రోజా ముందుంటున్నారు. అందుకే ఆమె సెకండ్ ప్లేస్ సంపాదించుకున్నారు.


          జగన్ పాదయాత్ర సమయంలో జరిగే అసెంబ్లీలో జగన్ స్థానాన్ని రోజానే భర్తీ చేస్తారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవలికాలంలో రోజాను జగన్ పక్కనపెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అది అవాస్తవమని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారంలో రోజా మళ్లీ పార్టీ అఫీసులో ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. దీంతో అమెను జగన్ పక్కన పెట్టారనే వార్తలు నిజం కాదని తేలిపోయింది.


          అయితే అసెంబ్లీలో చంద్రబాబు వ్యూహాలను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని, సీనియర్ లైన శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు మాత్రమే పార్టీని లీడ్ చేయగలరని మరికొంతమంది భావిస్తున్నారు. ఒకవేళ రోజాకు ఆ ఛాన్స్ దక్కకపోతే పార్టీని లీడ్ చేసే అవకాశం వారిద్దరిలో ఒకరికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.


          కానీ టీడీపీని టార్గెట్ చేయడంలో శ్రీకాంత్, పెద్దిరెడ్డి కంటే రోజానే ముందుంటారని, ఆమెకే లీడ్ చేసే బాధ్యతలను అప్పగిస్తే మంచిదనే వాదన కూడా పార్టీలో జరుగుతున్నట్టు సమాచారం. అయితే జగన్ మాత్రం ఇప్పటివరకూ ఈ అంశంపై ఎలాంటి డిస్కషన్ చేయనట్టు తెలుస్తోంది. జగన్ ఆలోచన ఎలా ఉందో ఎవరికి లీడ్ బాధ్యత దక్కుతుందో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: