బాలికపై అత్యాచారం చేసిన టివి నటుడు..?!

Edari Rama Krishna
దేశంలో గత కొంత కాలంగా మహిళలపై, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఇలాంటి వార్తలు ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నా..కొంత మంది కామాంధులు చేస్తున్న ఇలాంటి తప్పిదాల వల్ల సభ్య సమాజం తలదించుకుంటుంది.  ఒకప్పుడు భారత దేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు..కానీ ఇప్పుడు ఓ మహిళ, చిన్నారులు సైతం పట్టపగలు బయట తిరగాలన్నా భయపడుతున్నారు. ఈ మద్య సెలబ్రెటీలను సైతం కొంత మంది దుర్మార్గులు వదలడం లేదు.

తాజాగా  ఓ బుల్లితెర నటుడు 15ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి గర్భానికి కారణమైయ్యాడని వార్తలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.  కేరళ, తిరువనంతపురం సమీపంలో కుత్తిక్కాడు అనే ప్రాంతానికి చెందిన ఓ బాలిక తనపై అత్యాచారం జరిగిందని ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిని చేసినట్లు..పెళ్లి చేసుకోమంటే కాదు పొమన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ..పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.  

ఆ బాలిక పేదరికంలో ఉండటంతో అదే ప్రాంతంలో ఉంటున్న శ్రీకళ అనే మహిళ ఆ బాలికను వ్యభిచార రొంపలోకి దింపింది.  ఆమెకు ముగ్గురు ఆటోడ్రైవర్లు కూడా సహకరిస్తూ..ఆ బాలికతో వ్యభిచారం చేయిస్తు వచ్చారు.  అంతే కాదు అప్పుడప్పుడు వారు కూడా తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు.  అయితే ఆ బాలికతో బుల్లి తెర నటుడు  మధ్య శారీరక సంబంధం వుందని.. ఆమెను విష్ణుసాగర్ అనేకసార్లు వాడుకున్నాడని తెలిసింది.  

ఈ విషయం తెలుసుకున్న శ్రీకళ అతడి వద్ద నుంచి డబ్బు లాగాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది.  అయితే ఆ బాలిక చేసిన ఫిర్యాదు తో శ్రీకళతో పాటు ముగ్గురు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: